Begin typing your search above and press return to search.

మాస్కు పెట్టుకోవా..అయితే దిగిపో..ప్రయాణికుడిని దింపేసిన పైలట్​

By:  Tupaki Desk   |   10 Sept 2020 4:00 PM IST
మాస్కు పెట్టుకోవా..అయితే దిగిపో..ప్రయాణికుడిని దింపేసిన పైలట్​
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు పెట్టుకోకుండా జనజీవన స్రవంతిలో తిరుగుతూ తోటివాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సాధారణ జనాల పరిస్థితి ఇలా ఉంటే.. విమానాల్లో ప్రయాణించేవారు కూడా బాధ్యత లేకుండానే వ్యవహరిస్తున్నారు. టర్కీలో ఓ వ్యక్తి మాస్క్​ లేకుండానే విమానం ఎక్కాడు. విమానయాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. పైగా సిబ్బంది, తోటి ప్రయాణికులతో గొడవపెట్టుకుంటూ రచ్చ రచ్చ చేశాడు. దీంతో పైలట్ ​లు విమానాన్ని అర్జెంట్​గా ల్యాండ్​చేసి సదరు వ్యక్తిని బయటకు పంపారు. అనంతరం అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన టర్కీలో చోటు చేసుకుంది. బ్రిటన్‌కి చెందిన 32 ఏళ్ల ఓ ప్రయాణికుడు టర్కీలోని అంతల్య ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కాడు. విమానం గాల్లోకి లేచాక అతడు మాస్కు ధరించలేదన్న విషయాన్ని గుర్తించారు సిబ్బంది. అతడి వద్దకు వెళ్లి మాస్కు ధరించాలని సూచించారు. ఎంత చెప్పినా అతడు పట్టించుకోలేదు. మరోవైపు తోటి ప్రయాణికులు సైతం అతడి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో విమాన సిబ్బంది విషయాన్ని పైలట్ల దృష్టికి తీసుకెళ్లారు. విమానం మార్గమధ్యంలో ఉండగా.. పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. కోస్‌ ఐలాండ్‌ ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడి ఎమర్జెన్సీగా కిందకు దించారు. పైలట్ ఇచ్చిన సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.