Begin typing your search above and press return to search.
నా చుట్టూ ఫిక్సర్లే .. మౌనం వీడిన అక్తర్
By: Tupaki Desk | 2 Nov 2019 5:01 PM ISTషోయబ్ అక్తర్ .. ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఒక పేజీ ని క్రియేట్ చేసుకున్నారు. పాకిస్తాన్ జట్టులో కీలక బౌలర్ గా .. ఎందరో స్టార్ క్రికెటర్స్ గుండెల్లో తన పదునైన బంతులతో వణుకు పుట్టించాడు. బాల్ ని అత్యంత వేగంగా విసరడంలో అక్తర్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. తాజాగా అక్తర్ ఫిక్సింగ్ పై మౌనం వీడాడు. తానెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడక పోయినా, ఫిక్సింగ్‌తో పాకిస్తాన్ క్రికెట్‌ను మోసం చేయకపోయినా, మ్యాచ్ ఫిక్సర్స్‌తో క్రికెట్ ఆడటం మాత్రం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నాడు. మహ్మద్ అమిర్, అసిఫ్, సల్మాన్ భట్‌లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురి కావడం తన కెరీర్‌లో ఒక చేదు జ్ఞాపకం అని తెలిపారు.
నా చుట్టూ ఉండేది ఫిక్సర్లే అని తెలియక విజయం కోసం పోటీ పడ్డానని తెలిపాడు. ను ఎప్పుడూ ఒకటే నమ్ముతా.. ఫిక్సింగ్ చేసి పాకిస్తాన్ క్రికెట్‌ను ఎప్పుడూ మోసం చేయలేదు. నా కెరీర్‌లోనే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది లేదు. కానీ నా చుట్టూ మ్యాచ్ ఫిక్సర్లే ఉన్నారు. నేను మొత్తం 22 మందికి వ్యతిరేకంగా క్రికెట్ ఆడా. అసలు మ్యాచ్ ఫిక్సర్ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డ అసిఫ్ మొత్తం మ్యాచ్‌లన్నీ బుకీలు ఫిక్సింగ్ చేసినట్లు నాకు చెప్పాడు.
పాకిస్తాన్ తరఫున ఫిక్సింగ్ పాల్పడి నిషేధాన్ని కూడా ఎదుర్కొని మళ్లీ పాకిస్తాన్ జట్టు తరఫున రీ ఎంట్రీ ఇచ్చిన అమిర్ తలుచుకుంటే నాకు కోపం వస్తుంది. ఆమిర్ నన్ను చాలా గాయపరిచాడు. అమిర్, అసిఫ్‌లు ఎందుకు ఫిక్సింగ్ చేసారో నేను అర్ధం చేసుకోగలను. అమిర్, ఆసిఫ్‌లు ఫిక్సింగ్ చేశారనే అభియోగాలు విన్న మరక్షణం నేను చాలా నిరూత్సాహానికి గురయ్యా. వారి టాలెంట్ వృథా అయిపోందనుకున్నా. ఇద్దరు టాప్ బౌలర్లు ఇలా చేయడం బాధించింది. కొద్దిపాటి డబ్బుకు ఆశపడి ఇలా చేయడం జీర్ణించుకోలేకపోయాను అని అక్తర్ చెప్పారు. ఇక అక్తర్ 2011లో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడాడు. ఆ సమయంలోనే పాకిస్తాన్ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం జరిగింది.