Begin typing your search above and press return to search.

సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. పోలీసులకు ఊహించని షాక్

By:  Tupaki Desk   |   12 Sep 2020 1:30 AM GMT
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. పోలీసులకు ఊహించని షాక్
X
ఉత్తరప్రదేశ్ లో ఓ సెక్స్ రాకెట్ ను పోలీసులు పట్టుకొని రట్టు చేశారు. అయితే ఆ సెక్స్ వర్కర్లకు కరోనా అని తేలడంతో వారికి ఊహించని షాక్ తగిలింది. దీంతో వీరిని కలిసిన విటుల కోసం వేట మొదలుపెట్టారు. దాడి చేసిన పోలీసులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఘటన యూపీలోని బరేలీలో చోటుచేసుకుంది.

బరేలీలోని గంగోత్రినగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 50 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు, ఆరుగురు సెక్స్ వర్కర్లు సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి కరోనా పరీక్షలు చేయగా.. ఆరుగురు మహిళల్లో ఐదుగురికి కరోనాగా తేలింది.

సదురు సెక్స్ వర్కర్లతో ఇటీవల ఎంజాయ్ చేసిన విటుల గురించి ఆరోగ్యశాఖ అధికారులు ఆరాతీస్తున్నారు. వారిని పట్టుకోవడానికి వేట మొదలుపెట్టారు.

ఇక సెక్స్ రాకెట్ పై దాడులు చేసిన పోలీసులు సైతం పరీక్షల కోసం రెడీ అవుతున్నారు. అందరూ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా అని తేలితే ఐసోలేషన్ లోకి వెళ్లడానికి రెడీ అయ్యారు.