Begin typing your search above and press return to search.

టీడీపీ నుంచి వైసీపీలోకి ఐదుగురు ఎమ్మెల్సీల జంప్

By:  Tupaki Desk   |   25 Jun 2020 3:00 PM IST
టీడీపీ నుంచి వైసీపీలోకి ఐదుగురు ఎమ్మెల్సీల జంప్
X
శాసనసభ లో 151మంది ఎమ్మెల్యేలతో అన్ని బిల్లులను ఈజీగా నెగ్గించుకుంటున్న జగన్ సర్కార్ కు శాసనమండలి మాత్రం బ్రేక్ వేస్తోంది. అక్కడ ప్రతిపక్ష టీడీపీ ప్రాబల్యంతో బిల్లులు ఆగి పోతున్నాయి. ఈ క్రమం లో శాసన మండలి లో తొలి బలాన్ని పెంచుకునే దిశ గా వైసీపీ తొలి అడుగులు వేసింది.

ఏపీలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శాసనమండలి ఇప్పుడప్పుడే రద్దు అయ్యే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే మండలి రద్దు బిల్లులో పార్లమెంట్ లో పాస్ కావాలి.. రాష్ట్రపతి ఆమోదించాలి.ఇలాంటి కరోనా టైంలో ఏపీ శాసన మండలి రద్దు బిల్ కు బీజేపీ ప్రభుత్వం అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంట.. అందుకే వైసీపీ ప్రభుత్వం కూడా ఇక మండలి రద్దు ఇప్పట్లో జరగదని భావిస్తోంది.

ఇలాంటప్పుడు ఏపీ సీఎం జగన్ టీడీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కే వైసీపీ తరుఫున నిలబెట్టి ఆయన సీటును ఆయనతోనే భర్తీ చేశాడు. కాబట్టి మనం కూడా అధికార పార్టీలోకి వెళితే ఇలానే మన సీట్లకు కూడా ఢోకా ఉండదని టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అందరూ మూకుమ్మడిగా త్వరలోనే వైసీపీలోకి జంప్ చేయడానికి ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంలో వైసీపీలోని పెద్ద ఆయన ఒక లీడర్ దగ్గరికి కొందరు వచ్చారని.. వైసీపీలోకి చేరికపై సమాలోచనలు చేస్తున్నారని తాడేపల్లిలో చెవులు కొరుక్కుంటున్నారు. మెల్లిగా అందరూ ఎమ్మెల్సీలు వైసీపీలోకి జారుకునే పరిస్థితి ఉందని.. పవర్ పాలిటిక్స్ కాబట్టి ఇలా చేయడంలో ఏమీ తప్పు లేదు అని కొందరు విశ్లేషకులు సలహా కూడా ఇచ్చారట.. సో త్వరలోనే టీడీపీకి చెందిన 5 ఎమ్మెల్సీలు వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.