Begin typing your search above and press return to search.

పెగాసస్ నిఘా .. సుప్రీంలో ఐదుగురు జర్నలిస్టుల సంచలన పిటిషన్ !

By:  Tupaki Desk   |   3 Aug 2021 5:30 AM GMT
పెగాసస్ నిఘా .. సుప్రీంలో ఐదుగురు జర్నలిస్టుల సంచలన పిటిషన్  !
X
పెగాసస్ వ్యవహారం ఇండియా లో కాకరేపుతోంది. పెగాసస్ స్పైవేర్ సాయంతో ప్రతిపక్ష నేతలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, 40 మంది జర్నలిస్ట్‌లు సహా 300 మంది ఫోన్‌ లను హ్యాక్ చేసినట్టు వచ్చిన కథనాలపై దుమారం రేగుతోంది. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముందు రోజే ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే , ఈ నిఘా వ్యవహారం ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, ఇతర దేశాల్లోనూ కలకలం రేపుతోంది. అయితే, ఇంతకు ముదే కొన్ని దేశాల ప్రభుత్వాలకు ఆ సాఫ్ట్‌ వేర్ అమ్మకాన్ని నిలిపివేశారు. కానీ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్న అన్ని దేశాలకూ సేవలు నిలిపివేసినట్లుగా ఆ కంపెనీ చెప్పుకుంది. ఏ ఏ దేశాలు అన్నది చెప్పలేదు కానీ,పెగాసస్ వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపధ్యంలో ఇండియాలో కూడా ఆ సంస్థ తన సేవల్ని నిలిపివేసినట్లుగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారు చేసిన 'పెగాసస్'అనే స్పైవేర్ ను ఉపయోగించి, భారత్ లో వివిధ రంగాలకు చెందిన వందల మందిపై కేంద్ర ప్రభుత్వమే నిఘాకు పాల్పడిందనే వివాదంలో తొలిసారి బాధితులు నేరుగా ముందుకొచ్చారు.

పెగాసస్ ఉదంతంపై ఇప్పటిదాకా రాజకీయ నేతలు, థర్డ్ పార్టీ వ్యక్తులు విమర్శలు చేయడం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే పబ్లిక్ మీటింగ్ లోనే 'మోదీ నా మీటింగ్స్ పై నిఘా పెట్టాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. పెగాసన్ నిఘా కుట్ర అసలు జరగలేదని వాదిస్తోన్న కేంద్రం, విపక్షాలు ఆరోపణలను తిప్పికొడుతోంది. కానీ పార్లమెంటు వేదికగా, బయట కూడా ఈ అంశంపై రాజకీయ రచ్చ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్ట్, ది హిందూ పత్రిక ఎడిటర్ ఎన్. రామ్ సుప్రీంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈనెల 5న విచారణకు రాబోతుంది.

ప్రముఖ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ లు వేసిన పిటిషన్ల పై ఈనెల 5న విచారణ జరుగనుండగా, పెగాసస్ నిఘా అనుమానిత బాధితులైన మరో ఐదుగురు జర్నలిస్టులు సైతం సుప్రీంకోర్టు తలుపుతట్టారు. కేంద్ర ప్రభుత్వం నిఘాకు పాల్పడిందంటూ ఆమ్నెస్టీ సహా పలు మీడియా సంస్థలు 500 పేర్లను వెల్లడించగా, ఆ జాబితాలో ఈ ఐదుగురు జర్నలిస్టుల పేర్లు కూడా ఉన్నాయి. తద్వారా పెగాసస్ నిఘా ఉదంతంపై బాదితులే తొలిసారి ఫిర్యాదు చేసినట్లు అయింది. పెగాసస్ స్పైవేర్ వాడకానికి సంబందించి కేంద్రం కచ్చితంగా సమాధానం చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఐదుగురు జర్నలిస్టులు సోమవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. థార్డ్ పార్టీకి చెందిన సంస్థతో తమ ఫోన్లను చెక్ చేయించగా, స్పైవేర్ చొరబడినట్లు, నిఘా జరిగినట్లు వెల్లడైందని జర్నలిస్టులు ప్రేమ్ శంకర్ ఝా, ఆర్కే సింగ్, ప్రాంజయ్ తకుర్తా, ఎస్ఎన్ అబీదీ, ఇప్సా షతక్సిలు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. పెగాసస్ నిఘా ఉదంతంపై ఇప్పటికే పలు పిటిషన్లను విచారిస్తోన్న సుప్రీంకోర్టు.. దీన్ని కూడా స్వీకరించే అవకాశముంది