Begin typing your search above and press return to search.

దేశంలో తొలిసారి.. మూడేళ్ల చిన్నారికి కరోనా

By:  Tupaki Desk   |   9 March 2020 8:10 AM GMT
దేశంలో తొలిసారి.. మూడేళ్ల చిన్నారికి కరోనా
X
ప్రపంచాన్ని ఆందోళనకు గురయ్యేలా చేస్తున్న కరోనా వైరస్ కారణంగా.. ఎప్పుడేం ముంచుకొస్తుందన్నది ఏ మాత్రం అంచనా వేయని రీతిలో మారింది. మొన్నటికి మొన్న చైనాను ఊపేసిన కరోనా.. ఇప్పుడు యూరప్ లోనూ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఊహించని విధంగా ఇటలీలో అంతకంతకూ విస్తరిస్తుండటంతో ఆ దేశంలోని 1.5 కోట్ల మంది ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో.. ఆ దేశంలో ప్రజలు బయటకు రాకుండా నిషేధాన్ని విధించారు. ఇదిలా ఉంటే.. తాజాగా దేశంలోని మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్ సోకింది.

ఆదివారమే కేరళకు చెందిన ఐదుగురికి కరోనా సోకినట్లుగా తేలటంతో ఆ రాష్ట్రం ఉలిక్కి పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఐదుగురికి కరోనా సోకింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక కుటుంబం ఇటలీ వెళ్లింది. కోచి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు కరోనా అనుమానంతో చిన్నారిని.. వారి తల్లిదండ్రులకు వేరుగా ఉంచారు. వారి బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. తాజాగా.. ఆ చిన్నారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. ఆ పాపను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆ చిన్నారి తల్లిదండ్రుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్ కు చెందిన ఒక మహిళ కూడా కరోనా బారిన పడినట్లు గుర్తించారు. ఇటీవల ఇరాన్ వెళ్లి వచ్చిన ఈ మహిళకు వైరస్ సోకినట్లుగా గుర్తించాు. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఆందోళన వ్యక్తమయ్యేలా చేస్తోంది. ఇంతకాలం చిన్నారుల్ని కరోనా ఏమీ చేయదన్న వాదన వినిపించేది. మూడేళ్ల పాపకు రావటంతో వైద్యులు ఉలిక్కి పడిన పరిస్థితి.