Begin typing your search above and press return to search.
ఆంధ్రప్రదేశ్ లో తొలి జీఎస్టీ కేసు నమోదు
By: Tupaki Desk | 19 Feb 2020 3:18 PM ISTగతంలో ఎన్నో రకాల పన్నులు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఒకే పన్ను విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానిలో ఎస్ జీఎస్టీ, సీజీఎస్టీ అని రెండు రకాలు. పన్నులు చెల్లించకుండా ఎగ్గొడుతున్నారనే ఉద్దేశంతో ఈ పన్ను విధానంలో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలవుతోంది. ఈ పన్నులను కూడా చెల్లించకుండా ఎగ్గొడుతున్న వ్యాపారులు, వ్యక్తులు, సంస్థలు ఉన్నారు. అలా ఎగ్గొడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా మంగళవారం రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్ జీఎస్టీ) చట్టం కింద తొలి కేసు నమోదైంది.
విశాఖపట్టణానికి చెందిన శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ యజమాని శేఖర్ వే బిల్లులు దుర్వినియోగం చేసి రూ.2.6 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. ఈ పన్ను ఎగవేసిన వారిని జీఎస్టీ అధికారులు గుర్తించి నిందితులను అరెస్ట్ చేసి జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. వారికి మంగళవారం కోర్టు రిమాండ్ విధించింది. వీరితో పాటు మరికొందరు వ్యాపారులు రూ.10 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
శేఖర్ దాదాపు రూ.2.6 కోట్ల పన్ను ఎగవేశారని ప్రాథమిక దర్యాప్తు లో గుర్తించారు. ఆన్‌లైన్ వే బిల్లుల దుర్వినియోగం ద్వారా ఇంత భారీ మొత్తం పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించి చర్యలు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారం గా ఆన్‌లైన్ వే బిల్లుల దుర్వినియోగం ద్వారా ఇంత భారీ మొత్తం పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జీఎస్టీ చట్టం కింద నమోదైన తొలి కేసు ఇది కావడం విశేషం.