Begin typing your search above and press return to search.
తెలుగు నేల మీద తొలి 'గే' పెళ్లి
By: Tupaki Desk | 20 Dec 2021 9:23 AM ISTకాలం మారిపోయింది. అప్పట్లో పెళ్లికి కులాలు.. మతాలు.. అడ్డు వచ్చేవి. ఇప్పుడు వాటికి మించి మరోలాంటి సమస్య వచ్చి పడింది. పెళ్లి అంటే అబ్బాయి.. అమ్మాయి జత కట్టటం. కానీ.. అందుకు భిన్నంగా ఇద్దరు అమ్మాయిలు.. లేదంటే ఇద్దరు అబ్బాయిలు మనసు పడి పెళ్లి చేసుకోవటం ఈ మధ్య పెరుగుతోంది. అయితే.. ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంటాయి. అందుకు భిన్నంగా ఒక రిసార్టులు.. బంధుమిత్ర గణంతో అంగరంగ వైభవంగా జరిగిన తొలి ‘గే’ పెళ్లిగా దీన్ని చెప్పాలి. ప్రేమకు కులాలు.. మతాలు మాత్రమే కాదు.. లింగ భేదాలు కూడా లేవన్న విషయాన్ని ఈ కొత్త జంట నిరూపించింది.
ఒకే లింగత్వం ఉన్న వారు పెళ్లి చేసుకోవటం తప్పుకాదని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తీర్పు ఇచ్చినప్పటికీ.. అలాంటి పెళ్లిళ్లకు తల్లిదండ్రులు ఓకే చెప్పింది లేదు. అందుకు భిన్నంగా తాజాగా ఒక మగ జంట.. ఇంట్లో వారిని ఒప్పించి.. వారందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తెలుగు నేల మీద ఈ తరహా ‘గే’ పెళ్లి ఇదే మొదటిదిగా చెప్పొచు. హైదరాబాద్ శివారులోని ఒక రిసార్టులో ఓపెన్ గా జరిగిన ఈ పెళ్లి వివరాల్లోకి వెళితే..
పంజాబ్ కు చెందిన అభయ్ డంగ్ సంగ్ అలియాస్ ప్రేమ ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రియో చక్రవర్తి హాస్పిటాలిటీ రంగానికి చెందిన కంపెనీలో పని చేస్తున్నారు. ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వీరి మధ్య ప్రేమ మొదలు కావటం.. అది ముదిరి పాకాన పడటమే కాదు.. గడిచిన ఎనిమిదేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. వీరు తమ ప్రేమను ఇంట్లో చెప్పటం.. ఇంటి వారి ఆగ్రహానికి గురయ్యారు. వీరి ప్రేమకు ససేమిరా అనటంతో వారు ఊరకుండిపోయారు.
అంతే తప్పించి.. విడిపోలేదు. కాలక్రమంలో వీరిద్దరూ కలిసే ఉండటంతో.. వీరి ప్రేమను వారి ఇంట్లోని వారు అర్థం చేసుకోక తప్పలేదు. మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించినా.. చివరకు మాత్రం వారి ప్రేమను గుర్తించి.. పెళ్లికి ఓకే చేశారు. దీంతో.. ఇంట్లోని వారు.. బంధుమిత్రుల సమక్షంలో ఈ ఇద్దరు కలిసి రిసార్టులో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వివాహానికి హాజరైన వారు కొత్త జంటను ఆశీర్వదించారు. తెలుగు నేల మీద బహిరంగంగా జరిగిన తొలి ‘గే’ పెళ్లిగా దీన్ని చెప్పాలి.