Begin typing your search above and press return to search.
170 ఏళ్ల చరిత్ర ఉన్న మీడియా సంస్థకు తొలి మహిళా ఎడిటర్ ఇన్ చీఫ్
By: Tupaki Desk | 16 April 2021 12:03 PM ISTఎవరెన్ని చెప్పినా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల పక్షాన నిలిచే మీడియాకు ఉండే పవర్ అంతా ఇంతా కాదు. ప్రజల కష్టాల్ని.. కడగండ్లను.. అధికారపక్షం చేసే తప్పులు.. మోసాల్ని వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. అలాంటిది ఒక ప్రముఖ మీడియా సంస్థకు.. అందునా 170 చరిత్ర ఉన్న సంస్థకు తొలిసారి ఒక మహిళ సారథ్యం వహించటం.. ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఎంపిక కావటం సామాన్య విషయం కాదు.
మీడియా సంస్థల్లో మగవారిదే పై చేయి. ఎడిటర్లుగా మహిళలు ఉండటం మామూలే కానీ.. ఎడిటర్ ఇన్ చీఫ్ గా మాత్రం ఎంపికయ్యే అవకాశాలు చాలా.. చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడి దాకానో ఎందుకు.. అందరికి సుపరిచితమైన రాయిటర్స్ సంస్థనే తీసుకుంటే.. ఇప్పటివరకు ఆ సంస్థకు ఎడిటర్ ఇన్ ఛీఫ్ గా ఒక్క మహిళ కూడా ఎంపిక కాలేదు. తాజాగా ఆ కొరత తీరుస్తూ 47 ఏళ్ల వయసున్న అలెస్సాండ్రా గలోని ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి ఆమె తోపు మీడియా సంస్థకు సారథ్యం వహించనున్నారు.
సాధారణంగా ఒక పెద్ద మీడియా సంస్థకు ఎడిటర్ ఇన్ చీఫ్ కావటం అంత సులువు కాదు. అందునా 47 ఏళ్ల చిన్న వయసులో అస్సలు సాధ్యం కాదు. కానీ.. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేయగలిగారు? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. గలోని రోమన్ మహిళ. నాలుగు భాషలు వచ్చు. బిజినెస్.. పొలిటికల్ వార్తల్లో నిపుణురాలు. ప్రపంచ వాణిజ్య.. రాజకీయ రంగంలో ఏం జరగనుంది? ఎలాంటి మలుపులు తిరగనుంది? అన్న విషయాన్ని ముందే ఊహించే సత్తా ఆమె సొంతం.
రాయిటర్స్ లో ఆమె తన కెరీర్ ను షురూ చేసి.. తాజాగా ఆ మీడియా సంస్థకే ఎడిటర్ ఇన్ ఛీఫ్ గా ఎంపికయ్యారు. ఇటాలియన్ న్యూస్ రిపోర్టర్ గా చేరి.. అతి తక్కువ సమయంలోనే ఆమె సంస్థకు సారథ్యం వహించనున్నారు. పాత్రికేయ రంగంలో అత్యంత గెరాల్డ్ లోయెబ్ ఫౌండేషన్ వారి 2020 మినార్డ్ ఎడిటర్ అవార్డు విజేతగా నిలిచారు. రాయిటర్స్ కు సారథ్యం వహించనున్న ఆమె.. ఇకపై 2000 మంది పాత్రికేయులకు సారధ్యం వహించనున్నారు. ప్రతిభ.. అంకితభావం నిండిన జర్నలిస్టుల టీంకు సారథ్యం వహించటం.. ప్రపంచ స్థాయి న్యూస్ రూమ్ ను నడిపించే అవకాశం రావటం తనకు లభించిన గౌరవంగా ఆమె పేర్కొన్నారు.