Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : ముంబై ధారవిలో కరోనా తొలి మరణం...మూసివేత !
By: Tupaki Desk | 2 April 2020 3:20 PM ISTకరోనా వైరస్ భారత్ లో శరవేగంగా విస్తరిస్తుంది. గత రెండు రోజుల ముందు వరకు దేశంలో కరోనా ప్రభావం పెద్దగా లేదు అనుకున్న సమయంలో ఢిల్లీ మర్కజ్ ఘటన తో దేశంలో ఒక్క సారిగా కరోనా కేసులు ఊహించని విదంగా పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలోకి కూడా కరోనా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ మురికివాడలో తొలి కరోనా మరణం సంభవించింది.
ఆ మురికివాడ కి చెందిన 56 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన ప్రాణాలు కోల్పోయాడు. సియాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం అతడు చనిపోగా.. అంతకు ముందే కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జ్వరం రావడంతో అతడు మార్చి 23న స్థానికంగా ఉన్న డాక్టర్ దగ్గరకు చెకప్ కోసం వెళ్లాడు. శ్వాస సంబంధ సమస్యలతో మార్చి 26న సియాన్ హాస్పిటల్ లో చేరాడు. వస్త్ర దుకాణం నడుపుతూ.. ధారవిలోని ఎస్ఆర్ఏ బిల్డింగ్ లో నివసించే ఆయనకు ట్రావెల్ హిస్టరీ లేదు.
కరోనాతో వ్యక్తి మరణించడంతో.. అతడి కుటుంబ సభ్యులకు కూడా బీఎంసీ పరీక్షలు నిర్వహిస్తోంది. అతడు నివసించిన బిల్డింగ్ మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి.. పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతం లో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. తాజాగా ముంబై అధికారులు ఈ మురికివాడకు సీలు వేశారు. ధారావీలోని 8 భవనాల్లో 308 ఫ్లాట్లు, 91 షాపులకు సీలు వేశారు. మురికివాడలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి వారికి పౌరసంఘం నుంచి ఆహారం, నిత్యావసరాలను అందిస్తున్నామని ముంబై మురికి వాడల పునరావాస అథారిటీ అధికారులు చెప్పారు. ధారావీ మురికివాడ నుంచి ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ తబ్లిగ్ జమాత్ సమావేశానికి వెళ్లి వచ్చారని తేలడం తో వారందరినీ హోం క్వారంటైన్ చేశారు.మహారాష్ట్ర లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 335కు చేరగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.