Begin typing your search above and press return to search.
జైల్లో సల్మాన్ తొలి రాత్రి అలా గడిచింది
By: Tupaki Desk | 6 April 2018 1:44 PM ISTకృష్ణ జింకల్ని వేటాడిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జైలు జీవితంలో ఫస్ట్ నైట్ ముగిసింది. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన తొలిరోజు ఎలాంటి అనుభవం ఎదురైందో.. సల్మాన్ కు అలాంటి అనుభవమే ఎదురైనట్లు చెబుతున్నారు. జోధ్ పూర్ జైలు అధికారులు ముందు చెప్పినట్లే.. సల్మాన్‌కు ఎలాంటి వీఐపీ ట్రీట్ మెంట్ ఇవ్వకుండా సాధారణ ఖైదీకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో అలాంటివే అందించారు.
జైలు వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ గురువారం రాత్రి నిద్ర పోలేదన్నారు. సల్మాన్‌కు ఖైదీ నంబరు 106ను ఇచ్చిన జైలు అధికారులు.. అత్యంత భద్రత కలిగిన బ్యారక్ నంబరు 22ను కేటాయించారు. ఇదే జైల్లో లైంగిక వేధింపుల కేసులో జైలు అనుభవిస్తున్న ఆశారాం బాపు పక్కనే సల్మాన్ గదిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
వీరిద్దరి మధ్య కేవలం పరదా మాత్రమే ఉన్నట్లుగా చెబుతున్నారు. సల్మాన్ ఉన్న సెల్ లో చెక్క మంచం.. రగ్గు.. కూలర్ మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు.
జైల్లో అందించే ఆహారమైన చపాతి.. పప్పును తినేందుకు సల్మాన్ నిరాకరించినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఆశారాం బాపు ఇచ్చిన ఆహారాన్ని సల్మాన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆశారాంకు జైలుకు సమీపంలోని ఆశ్రమం నుంచి ఆహారం వస్తుంటుంది. ఆ ఆశ్రమ భోజనాన్ని సల్మాన్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
తన పరుపును అందించేందుకు ఆశారాం సిద్ధపడినా సల్మాన్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. నేలపైన రగ్గు వేసుకొని సల్మాన్ పడుకున్నట్లుగా చెబుతున్నారు. రాత్రి మొత్తంలో సల్మాన్ కు మూడుసార్లు రక్తపోటు పెరిగినట్లుగా వైద్యులు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు.
రక్తపోటు తగ్గటానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారని.. వాటిని వేసుకొని సల్మాన్ పడుకున్నారట. అర్థాకలితో.. సరైన నిద్ర లేకుండా సల్మాన్ జైలులో మొదటి రాత్రి గడిచినట్లుగా జైలు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఖాన్ భాయ్ జైల్లో ఉండటంతో బాలీవుడ్ ప్రముఖులంతా పరామర్శలకు జైలు వద్దకు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా సల్మాన్ ను పరామర్శించేందుకు క్యూ కడుతున్నారు.