Begin typing your search above and press return to search.

IAS కొడుకుకి కరోనా ... అధికారులపై మండిపడ్డ సీఎం !

By:  Tupaki Desk   |   20 March 2020 4:00 PM GMT
IAS కొడుకుకి కరోనా ... అధికారులపై మండిపడ్డ సీఎం !
X
కరోనా వైరస్ ... ప్రస్తుతం భారత్ ని టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అర్థమౌతుంది. భారత్ లో ఈ వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా పది వేల మంది మరణించారు. దీనితో ఈ మహమ్మారి ఎటువైపు నుండి దాడి చేస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. భారతదేశంలో ఇప్పటికే 209 కరోణా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇకపోతే ఇప్పటివరకు ఇండియా లో మహారాష్ట్ర లో అత్యధికంగా 52 కేసులు నమోదు అయ్యాయి.

ఇకపోతే ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానటువంటి పచ్చిమ బెంగాల్ లో తాజాగా ఓ పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. లండన్ నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చిన 18 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ వ్యాధి ఉందని తాజాగా నిర్దారణ అయ్యింది. అయితే కరోనా వైరస్ సోకిన యువకుడు ఓ ఐఏఎస్ అధికారిని కుమారుడు కావడం , లండన్ నుండి వచ్చాక సరైన వైద్యపరీక్షలు చేయించుకోకుండా కోల్ కతా నగరాన్ని స్నేహితులతో కలిసి చుట్టేసాడని తెలియడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి మండిపడ్డారు.

పూర్తి వివరాలు చూస్తే ..పశ్చిమ బెంగాల్ హోం శాఖలో సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్న మహిళ కుమారుడు లండన్ లోని యూకే విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మార్చి 15వ తేదీన ఆ యువకుడు లండన్ నుంచి భారత్ కి చేరుకున్నాడు. వీఐపీ కుమారుడు కావడంతో నిర్లక్షంగా ఎయిర్ పోర్టు అధికారులు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేసి , కరోనా లక్షణాలు లేవు అని ఆ యువకుడిని ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపించేశారు. లండన్ నుంచి భారత్ వచ్చిన ఆ యువకుడు రెండు రోజుల పాటు కోల్ కతాలోని అన్ని మాల్స్ తిరిగి షాపింగ్ లు చేసి స్నేహితులతో కలిసి రెస్టారెంట్ లు తిరిగి ఫుల్ ఎంజాయ్
చేసాడు.

అయితే, ఆ తరువాత ఆ యువకుడు అనారోగ్యానికి గురికావడం తో , హాస్పిటల్ లో జాయిన్ చేయగా .. ఆ యువకుడికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. అయితే అప్పటికే ఆ యువకుడు కోల్ కతా నగరం మొత్తం తిరిగాడని తెలుసుకున్న అధికారుల దిమ్మతిరిగిపోయింది. లండన్ లో నివాసం ఉంటున్న యువకుడి స్నేహితులకు కరోనా వైరస్ సోకిందని ఐఏఎస్ అధికారిని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయినప్పటికీ , లండన్ లో వారితో కలిసి తిరిగిన కుమారుడికి వైద్యపరీక్షలు చేయించకుండా ఆ మహిళా ఐఏఎస్ అధికారిని కుటుంబ సభ్యులు పూర్తిగా నిర్లక్షం వహించారు. ఈ కారణంగా ఇప్పుడు మరెంతమంది ఈ వైరస్ భారిన పడబోతున్నారో.

ఈ మొత్తం విషయం తెలుసుకున్న పచ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు. విదేశాల నుంచి పశ్చిమ బెంగాల్ వస్తున్న ప్రయాణికులు అందరికీ కచ్చితంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని, వీవీఐపీలు, వీఐపీలు అంటూ నిర్లక్షం చేస్తే సంబంధిత అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటానని, వీవీఐపీల సంసృతికి స్వస్తి చెప్పాలని గతంలో తాను ఎన్నోసార్లు చెప్పానని సీఎం మమతా బెనర్జీ అధికారులను హెచ్చరించారు. అలాగే అతనికి కరోనా సోకి ఉంటుంది అని తేలినప్పటికీ , ఆ విషయాన్ని తేలికగా తీసుకున్న ఆ ఐఏఎస్ కుటుంబం పై కూడా దీదీ మండి పడ్డారు.

కాగా, ప్రస్తుతం ఆ యువకుడిని కోల్ కతాలోని ఐస్ లేషన్ వార్డులో చికిత్స చేయిస్తున్నారు. ఇదే సమయంలో ఆ యువకుడు ఐఏఎస్ అధికారిని కుటుంబ సభ్యులతో పాటు మాల్స్ లో ఎవరెవరిని కలిశాడు ?. అతని స్నేహితులకు ఏమైనా కరోనా వైరస్ వ్యాధి సోకిందా ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక ఐఏఎస్ కుమారుడికి కరోనా సోకినా రెండు రోజులపాటు గాలికి వదిలి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్న ఆ అధికారుల పై పచ్చిమ బెంగాల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.