Begin typing your search above and press return to search.

తెలంగాణ పోలీసులపై బిహార్ లో కాల్పులు.. అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   15 Aug 2022 4:47 AM GMT
తెలంగాణ పోలీసులపై బిహార్ లో కాల్పులు.. అసలేం జరిగింది?
X
దారిన పోయే వారిని దాడులు చేసే రోజులు పోయాయి. ఇళ్లకు.. ఖరీదైన ఆస్తుల్ని గుర్తించి కొల్లగొట్టే దారుణాలు తగ్గాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఆధారంగా చేసుకొని మనిషిలోని ఆశను టచ్ చేసి.. వారి సొమ్ముల్ని కొట్టేసే సైబర్ నేరస్తులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. సైబర్ నేరాలన్నంతనే బిహార్.. రాజస్థాన్ లకు చెందిన వారితో పాటు బెంగాల్ కు చెందిన పలువురు నేరస్తులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని వారిని టార్గెట్ చేయటం.. తెలివిగా వారి సొమ్ముల్ని దోచేయటం.. మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలాది రూపాయిలు కొట్టేస్తున్న వైనం తెలిసిందే. ఈ తరహా సైబర్ నేరస్తుల్ని ప్టటుకునేందుకు ఆయా రాష్ట్రాలకు వెళ్లే తెలంగాణ పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. ఒక సైబర్ దొంగను పట్టుకునేందుకు బిహారర్ వెళ్లిన తెలంగాణ పోలీసులకు తాజాగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.

సైబర్ నేరస్తుడ్ని అదుపులోకి తీసుకునేందుక ప్రయత్నించిన తెలంగాణ పోలీసులపై నిందితుడు కాల్పులు జరిపిన వైనం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని నిజాంపేటకు చెందిన వ్యాపారి ఒకరు కియా కార్ల డీలర్ షిప్ కోసం వెబ్ సైట్ లో వెతికాదు. కియా ఇండియా డీలర్ షిప్ . ఇన్ అనే వెబ్ సైట్ లో ఈ మొయిల్ చేశారు. తనకు నిజామాబాద్ జిల్లా డీలర్ షిప్ కావాలని వివరాలు పంపాడు. ఈ నేపథ్యంలోరాధిక అనే మహిళ ఫోన్ చేసి.. డీలర్ షిప్ కోసం అప్లికేషన్ పంపాల్సిన ఐడీ వివరాల్ని పంపింది. అనంతరం దాన్ని ఓకే చేస్తున్నట్లుగా మొయిల్ చేశారు.

రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ రూ.2.65 లక్షలతో మొదలుపెట్టి.. దఫదఫాలుగా డీలర్ షిప్ ఆశ చూపించి.. దాదాపు రూ.28.58లక్షల భారీ మొత్తాన్ని లాగేశారు. అంత డబ్బు పంపిన తర్వాత కూడా ఇంకా డబ్బు పంపాలని కోరటంతో సదరు బాధితుడికి అనుమానం వచ్చింది.

దీనికి కారణం తరచూ బ్యాంక్ అకౌంట్ మార్చేయటమే. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ ను కలిసిన బాధితుడు కలిసి.. తాను డబ్బు పంపుతున్న ఖాతా గురించి ఆరా తీయగా.. వాటిని పరిశీలించిన బ్యాంక్ మేనేజర్.. ఆ ఖాతాలన్ని నకిలీగా గుర్తించారు. దీంతో.. కియా కస్టమర్ కేర్ కు ఫోన్ చేయగా.. సదరు వెబ్ సైట్ నకిలీదిగా గర్తించారు. దీంతో.. సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో నేరస్తుల్ని ట్రాక్ చేసిన పోలీసులు ఇదంతా చేసింది బిహార్ లోని నవాదా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

అక్కడకు టీంగా వెళ్లిన తెలంగాణ పోలీసులు.. సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల్ని అరెస్టు చేసేందుకు వాహనాల్లో వెళ్లారు. శనివారం తెల్లవారుజామున నిందితుల్ని గుర్తించి పట్టుకునేందుకు సిద్ధం కాగా.. ప్రధాన నిందితుడు మిథిలేశ్ ప్రసాద్ పోలీసులపై కాల్పలుు జరిపి తప్పించుకున్నాడు. అయితే..తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఎవరూ గాయపడలేదు. అనంతరం మిగిలిన నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అంతేకాదు.. ప్రధాన నిందితుడు మిథిలేశ్ ప్రసాద్ ఇంటి నుంచి రూ.1.23 కోట్ల నగదు.. రెండు కార్లు.. ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీ.. తెలంగాణతోపాటు పట్నా.. కోల్ కతా తదితర నగరాల్లోని పలువురిని మోసగించినట్లుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకోవటానికి వెళ్లిన సందర్భంగా పోలీసులపై కాల్పులు జరిపిన ఉదంతం సంచలంనగా మారింది. సైబర్ నేరస్తుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన విషయం తాజా పరిణామం స్పష్టం చేసిందని చెప్పాలి. ఇలాంటి వారిపై చర్యలకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని చెప్పక తప్పదు.