Begin typing your search above and press return to search.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం భారీ అగ్నిప్రమాదం..ఆ పనిచేయడం వల్లే అని కలెక్టర్ - సీఎండీ వెల్లడి!
By: Tupaki Desk | 21 Aug 2020 1:20 PM ISTశ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి అకస్మాత్తుగా సంభవించిన పేలుళ్లలో నాలుగు టన్నెళ్లు ధ్వంసమయ్యాయి. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. 4వ యూనిట్ వద్ద కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించడంతో ఆరు టన్నెళ్లలో నాలుగు పేలిపోయాయి. ఇకపోతే ఈ ప్రమాదంలో కనీసం 9 మంది లోపలే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరివీలించారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ షార్ట్ సర్య్యూట్ వల్లనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. అలాగే , 1200 కేవీ లైన్ ను ఐసోలేట్ చేశామని, అది ట్రిప్ అవ్వడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రమాదం జరిగిన గంట ముందు వరకూ ఆ సిబ్బందితో కాంటాక్ట్ లోనే ఉన్నట్లు తెలిపారు. లోపల చిక్కుకొన్న వారికోసం పోలీసులు ,అగ్నిమాపక సిబ్బంది లోపల పొగ కారణంగా వెనక్కు వచ్చేశారని తెలిపారు. రాత్రి 10.30 గంటలకు మొదటి యూనిట్లో ఫైర్ జరిగిందని కలెక్టర్ చెప్పారు. జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి బాగుంది అని తెలిపారు. భూగర్భ విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలోనూ దట్టమైన పొగ కమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. జీరో లెవల్ నుంచి సర్వీస్ బే వరకు పొగ కమ్మేసినట్లు అయన తెలిపారు . ఈ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ను కూడా సజావుగా చేయలేకపోతున్నామని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం విద్యుత్ కేంద్రంలో 19 మంది ఇంజినీర్లు, సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పది మందిని అధికారులు రక్షించారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు.శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం పట్ల తెలంగాణ సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. విద్యుత్ కేంద్రం వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సిఎండి ప్రభాకర్ రావుతో ఫోన్ లో మాట్లాడిన ఆయన.. సహాయక చర్యలను పర్యవేక్షించారు.