Begin typing your search above and press return to search.
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం వెనుక అసలు కారణం అదేనట
By: Tupaki Desk | 27 Aug 2020 10:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. దిగ్భాంత్రికి గురి చేసిన శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి.. అసలు ప్రమాదానికి కారణం ఏమిటన్న విషయం పై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. ఘటన జరిగి ఇన్ని రోజులు అయినా.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా సోమవారం వరకు లోపలకు వెళ్లలేని పరిస్థితి. గడిచిన రెండు రోజుల్లో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రమాదానికి కారణం ఏమిటన్న విషయంపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ప్రమాదానికి కారణం ఏమిటన్న అంశాన్ని తెలియజేసే వీడియో ఒకటి గుర్తించారు. అందులో ప్యానెల్ బోర్డు కాలిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. ఆరో యూనిట్ లో ఉన్న ప్యానెల్ బోర్డులో మంటలు రావటంతోనే ఈ భారీ ప్రమాదానికి కారణంగా తేల్చారు. నాలుగో యూనిట్టు.. ఆరో యూనిట్ లలో బ్యాటరీల్ని బిగిస్తున్న వేళ.. ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్య్కూట్ చోటు చేసుకున్నట్లుగా తేల్చారు. ఇదే సమయంలో జనరేటర్లను నియంత్రించే సెన్సార్ కు నేరుగా విద్యుత్ సరఫరా కాక పోవటం తో లోడ్ పెరిగి మంటలు చెలరేగినట్లుగా భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే.. జెన్ కో సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయటం వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఆరో యూనిట్ లో జనరేటర్లు, సర్వీస్బే, కంట్రోల్ ప్యానల్స్, ట్రాన్స్ఫార్మర్లు, ఇండోర్ గ్యాస్ సబ్స్టేషన్, మెయిన్ కంట్రోల్ రూములు దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. ఆస్తి నష్టం దాదాపు రూ.100 కోట్ల మేర ఉందని అంచనా వేస్తున్నారు. జనరేటర్ కు భారీగా నష్టం జరగ లేదని.. రిపేర్లు చేస్తే సరి పోతుందన్న ఆలోచన లో అధికారులు ఉన్నారు. ఒకవేళ.. జనరేటర్ నష్టం భారీ గా జరిగి.. దాన్ని రిపేర్ చేయటానికి వీలు కాకుంటే మాత్రం నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. జనరేటర్ కు జరిగిన నష్టం ఎంతన్నది తేలటానికి మరికొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు.