Begin typing your search above and press return to search.
2 రోజులు ముందే వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదా?
By: Tupaki Desk | 22 Aug 2020 1:20 PM ISTషాకింగ్ గా మారిన శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్య్కూట్ ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నా.. అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పక తప్పదు. ఎందుకంటే.. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టినా కూడా.. యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోకపోవటమే తాజా ప్రమాదానికి కారణమంటున్నారు.
కొన్ని కథనాల ప్రకారం చూస్తే.. పవర్ హౌజ్లో టర్బైన్ల నుంచి నీటి తుంపర్లు పడటం.. వాటి కారణంగా కేబుల్స్ షార్ట్ సర్య్కూట్ అయ్యే ప్రమాదాన్ని స్థానిక ఏఈలు రెండు రోజుల క్రితమే గర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.త్వరలోనే దాన్ని పరిష్కరిస్తామని చెప్పారే కానీ.. వెంటనే స్పందించి.. రిపేర్లు చేసి ఉంటే.. ఇప్పుడిలాంటి పరిస్థితి ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది.
అడుగడుగునా నిర్వహణ లోపాలతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా తాజా ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. నిర్లక్ష్యమే ఘోర ప్రమాదానికి కారణమని.. తొమ్మిది మంది మరణానికి కూడా వారే బాధ్యులుగా చెబుతున్నారు. రూల్స్ ప్రకారం చూస్తే.. విద్యుదుత్పత్తి సీజన్ ప్రారంభానికి ముందు టర్బైన్లు.. కేబుళ్లు.. ఎలక్ట్రికల్.. విభాగాల్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఉన్నతస్థాయి అధికారుల సమక్షంలో ట్రయల్ రన్స్ నిర్వహించిన తర్వాత మాత్రమే విద్యుదుత్పాదకత షురూ చేయాల్సి ఉంటుంది.
కానీ.. అలాంటి విధివిధానాల్ని పాటించిన దాఖలాలు అక్కడ కనిపించవన్న విమర్శ వినిపిస్తోంది. ఎక్కడి దాకానో ఎందుకు పవర్ హౌజ్ లో ఎప్పటికప్పుడు గాలి వెళ్లేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉండాలి. యూనిట్లలో ఉష్ణోగ్రత సమతౌల్యంగా ఉండేలా ఏసీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. అత్యవసర పరిస్థఇతుల్లో పవర్ స్టేషన్ నుంచి తప్పించుకోవటానికి వీలుగా ఎస్కేప్ వేలు.. అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంచాలి. కానీ.. అలాంటివేమీ లేకపోవటం.. ఉన్న వాటిల్లో అరకొరగా ఉండటంతో ఇంత పెద్ద దుర్భటన చోటు చేసుకుందని చెబుతున్నారు. కిందిస్థాయి అధికారుల సూచనల్ని.. ఉన్నతస్థాయిలో ఉన్న వారు వెంటనే స్పందించి ఉంటే ప్రమాద తీవ్రత ఇంత దారుణంగా ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.