Begin typing your search above and press return to search.

తెలంగాణ భవన్ లో భారీ అగ్నిప్రమాదం.. వారివల్లే..

By:  Tupaki Desk   |   20 March 2021 2:30 PM GMT
తెలంగాణ భవన్ లో భారీ అగ్నిప్రమాదం.. వారివల్లే..
X
అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. టీఆర్ఎఎస్ ఎమ్మెల్సీగా అభ్యర్థి వాణిదేవి గెలవడంతో ఆ సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చారు. ఆ మంటలు చెలరేగి తెలంగాణ భవన్ కు అంటుకున్నాయి.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పీవీ కూతురు వాణిదేవి గెలవడంతో కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ లో సంబరాలు చేసుకున్నారు.

టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు సంబరాల్లో భాగంగా స్వీట్లు పంపిణి చేసుకున్నారు. టపాసులు కాల్చగా భవనం పైఅంతస్తున్న ఎండుగడ్డికి మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.మంటలను ఆర్పించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

గెలుపు సంబరాల్లో భాగంగానే బాణాసంచా కాల్చడంతోనే ఈప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. అప్రమత్తమైన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ అక్కడి నుంచి పంపించేశారు.