Begin typing your search above and press return to search.
మోడీని అలా చూపించిన గూగుల్ పై కేసు
By: Tupaki Desk | 12 May 2017 10:08 AM ISTప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ పై కేసు నమోదైంది. ప్రధాని నరేంద్ర మోడీని పేరును గూగుల్ చూపించిన వైనం ఇప్పుడు కేసుగా మారింది. 2015లో అభ్యంతరకరమైన జాబితాలో చేర్చటం.. ఫలితం చూపించిన తీరుపై చేసిన ఫిర్యాదు ఆధారంగా గూగుల్ పై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక న్యాయవాదికి గూగుల్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా తోచింది. వెంటనే.. గూగుల్ తీరున ఆక్షేపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సదరు లాయర్ ఫిర్యాదును స్వీకరించిన యూపీ పోలీసులు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎప్ ఐఆర్ ను నమోదు చేసినట్లుగా లక్నో నగర ఎస్పీ కమల్ కిషోర్ మీడియాకు వెల్లడించారు. 2015లో తాను వార్తలు చూస్తున్నప్పుడు.. ప్రధాని మోడీ పేరును అభ్యంతరకర జాబితాలో గూగుల్ చూపించటాన్ని తీవ్రంగా భావిస్తున్నట్లుగా.. తనతో పాటు.. దేశ ప్రజల మనోభావాలు ఈ కారణంగా దెబ్బ తిన్నాయని.. ఇందుకు కారణమైన గూగుల్ పై చర్యలు తీసుకోవాలంటూ సదరు లాయర్ నందకిషోర్ ఫిర్యాదులో కోరారు.
దీన్ని విచారణకు స్వీకరించిన పోలీసులు.. తమకు అందిన ప్రాధమిక సమాచారం మేరకు గూగుల్ మీద కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. మరి.. యూపీ పోలీసులు నమోదు చేసిన కేసుపై గూగుల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/