Begin typing your search above and press return to search.

జయప్రదపై సెక్సీ కామెంట్లు.. మరిన్ని చిక్కులు!

By:  Tupaki Desk   |   3 July 2019 12:17 PM GMT
జయప్రదపై సెక్సీ కామెంట్లు.. మరిన్ని చిక్కులు!
X
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో నటి - రాజకీయ నేత జయప్రదపై బీఎస్పీ నేత అజాంఖాన్ సెక్సీ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆమె భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా బరిలోకి దిగడంపై అజాంఖాన్ తీవ్రంగా విమర్శించాడు. మామూలుగా ఆమె కమలం పార్టీలోకి చేరడాన్ని అజాంఖాన్ విమర్శించి ఉంటే అదో లెక్క.

అయితే ఈ సమాజ్ వాదీ పార్టీ నేత జయప్రద పై వ్యంగ్యంగా స్పందించాడు. సెక్సీ కామెంట్లు చేశాడు. 'ఆమె ఖాకీ చెడ్డీ ధరించిందని.. నాకు చాలా సంవత్సరాల కిందటే తెలుసు..' అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఆ మాటలు దుమారం రేపాయి.

ఒక మహిళా నేతను విమర్శించే సమయంలో ఆమె గురించి అలాంటి వ్యాఖ్యానం చేయడం వివాదంగా మారింది. జయప్రదపై ఆయన చేసిన సెక్సీ కామెంట్లు వివాదం అయ్యాయి. అప్పట్లోనే ఆ వ్యవహారంపై కేసులు కూడా నమోదు అయ్యాయి.

అజాంఖాన్ పై బీజేపీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందాయి. అందుకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయి. తాజాగా యూపీలోనే ఈ అంశంపై మరో ఫిర్యాదును పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. అజాంకాన్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అనుచితంగా మాట్లాడిన ఆ సమాజ్ వాదీ పార్టీ నేతకు మరిన్ని ఇక్కట్లు తప్పేలా లేవని పరిశీలకులు అంటున్నారు.