Begin typing your search above and press return to search.

జ‌పాన్ ద‌రిద్రం తెలుగు రాష్ట్రాల‌కు ప‌ట్ట‌నుందా?

By:  Tupaki Desk   |   5 July 2019 11:45 AM IST
జ‌పాన్ ద‌రిద్రం తెలుగు రాష్ట్రాల‌కు ప‌ట్ట‌నుందా?
X
తాజాగా పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక స‌ర్వే ఎన్నో కొత్త విష‌యాల్ని.. మ‌రెన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌తో పాటు.. తెలుగు వారికి ఆందోళ‌న క‌లిగించే అంశాల్ని ప్ర‌స్తావించింది. జ‌పాన్ లో ఇప్పుడు ఎలా అయితే ప‌ని చేసే యూత్ సంఖ్య త‌గ్గి.. ముస‌లోళ్ల సంఖ్య పెరిగిందో.. ఇంచుమించు ఇదే ప‌రిస్థితి రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రానున్న విష‌యాన్ని వెల్ల‌డించింది. ఇప్పుడున్న అంచ‌నా ప్ర‌కారం 2041 నాటికి ఏపీలో జ‌నాభా వృద్ధి రేటు సున్నాకు చేరుకుంటుంద‌ని.. తెలంగాణ‌లో 0.21 శాతానికి చేరుకుంటుంద‌న్న అంచ‌నా వేశారు.

చాలా రాష్ట్రాల‌కు వ‌ల‌స‌లు త‌ప్పించి జ‌నాభా పెరిగే అవ‌కాశం లేద‌న్న కొత్త విష‌యాన్ని వెల్ల‌డించింది. ఇప్పుడున్న అంచ‌నానే నిజ‌మైతే..రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కోవ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను చెబుతున్నారు. మ‌రికొన్నేళ్ల‌లో ప‌ని చేసే యువ‌త సంఖ్య త‌గ్గి.. వృద్ధుల సంఖ్య పెర‌గ‌టం ప్ర‌తికూల ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌న్న మాట వినిపిస్తోంది.

చేదు నిజాల‌తో ఉలిక్కిప‌డేలా చేసిన ఆర్థిక స‌ర్వే.. కొన్ని తీపివార్త‌ల్ని మోసుకొచ్చింది. ఆయుః ప్ర‌మాణం పెరిగింద‌ని.. మ‌ర‌ణాల శాతాలు త‌గ్గుతున్న‌ట్లుగా పేర్కొంది. అంతేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్ప‌త్తిలోనూ మెరుగైన విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఏపీలో 2001లో స‌గ‌టు సంతాన సాఫ‌ల్య నిష్ప‌త్తి 2.3 శాతం ఉంటే.. 2041 నాటికి అది కాస్తా 1.5 శాతానికి చేరుతుంద‌ని.. తెలంగాణ‌లో 2.3 శాతం కాస్తా 1.6 శాతానికి చేరే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. బేటీ బ‌చావో-బేటీ ప‌డావో కార్య‌క్ర‌మం పెద్ద రాష్ట్రాల మీద మంచి ప్ర‌భావాన్ని చూపింద‌ని.. లింగ‌నిష్ప‌త్తి మ‌ధ్య అంత‌రం త‌గ్గిన‌ట్లుగా పేర్కొన్నారు.

2021-41 మ‌ధ్య కాలంలో తెలంగాణ‌లో జ‌నాభా పెరుగుద‌ల 7.4 శాతం ఉంటే.. ఏపీలో 3.4 శాతం మాత్ర‌మే ఉంటుంద‌ని అంచాన వేశారు. ఇక‌.. 2041 నాటికి తెలంగాణ జ‌నాభా 4 కోట్ల మార్క్ కు చేరుకుంటే.. అదే స‌మ‌యానికి ఏపీ జ‌నాభా 5.43 కోట్ల‌కు చేరుకునే వీలున్న‌ట్లు లెక్క క‌ట్టారు. రానున్న 20 ఏళ్ల‌లో తెలంగాణ‌లో యుక్త‌వ‌య‌స్కుల త‌గ్గ‌దుల 14 శాతం ఉంటే.. ఏపీలో అది మ‌రింత ఎక్కువ ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారి పెరుగుద‌ల 10శాత‌మే ఉండ‌టం విశేషం.