Begin typing your search above and press return to search.
ఈసారీ రూ.లక్ష కోట్లకు తగ్గేదే లెదంటున్న సర్కార్!?
By: Tupaki Desk | 27 Feb 2022 6:00 PM ISTరాసుకో రామస్వామి అంటూ భీమ్లానాయక్ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా..ఏపీ ప్రజలు సైతం తమకు బాగా తెలిసిన లెక్కల రామస్వామికి కొత్త లెక్కను చెప్పేయొచ్చన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఆర్థిక ఏడాదిలోనూ (గత ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31వరకు) రూ.లక్ష కోట్లకు తక్కువ కాకుండా అప్పు చేసే దిశగా ఏపీ సర్కారు వెళుతుందని చెప్పక తప్పదు.
ఆర్థిక సంవత్సరం క్యాలెండర్ ను చూస్తే.. ఫిబ్రవరి 28 నాటికి 11 నెలలు పూర్తి అవుతాయి. ఈ పదకొండు నెలల్లో ఏపీ సర్కారు ఏకంగా రూ.90వేల కోట్ల అప్పును తీసుకొచ్చేసింది. మిగిలిన ఒక్క నెలలోనూ మరో రూ.10 వేల కోట్ల అప్పునకు సిద్ధమవుతోంది ఏపీ సర్కారు. కేంద్రాన్ని అదే పనిగా విన్నపాలు పెట్టుకోవటం.. కార్పొరేషన్లను బదలాయింపు.. బ్యాంకుల్లో తాకట్లతో.. ఇప్పటికే రూ.90వేల కోట్ల అప్పును తీసుకొచ్చిన వైనం తెలిసిందే.
గడిచిన పదకొండు నెలల్లో రిజర్వు బ్యాంకులో బాండ్ల వేలం ప్రక్రియ ద్వారా రూ.43 వేల కోట్ల రుణాన్ని తీసుకొచ్చింది. కొత్తగా మరో రూ.2వేల కోట్లు అప్పు తెచ్చేందుకు వీలుగా ప్లాన్ చేస్తోంది. దీంతో.. ఈ నెలాఖరు నాటికి రిజర్వు బ్యాంకు నుంచి బాండ్ల వేలంతో సమీకరించిన అప్పు రూ.45వేల కోట్లకు చేరుతుంది.
ఇవి కాకుండా 11 నెలల్లో కేంద్రం నుంచి వచ్చిన రుణాలు.. ఈఏపీ.. నాబార్డు లోన్లు.. ఉద్యోగుల జీపీఎఫ్.. ఏపీజీఎల్ నిధుల ద్వారా దాదాపు రూ.15వేల కోట్లను ప్రభుత్వం వాడుకుంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.30వేల కోట్లను బ్యాంకుద్వారా తెచ్చుకున్నారు. మార్చి నెలలో ఏపీ రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి.. బెవరేజన్ కార్పొరేషన్ నుంచి రూ.5వేల కోట్లు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీంతో.. ఈ అప్పుల్ని కలిపితే మొత్తం రూ.లక్ష కోట్లకు చేరుకున్నట్లు అవుతుంది.
ఎప్పటికప్పుడు కొత్త అప్పుల్ని తెచ్చేందుకు వీలుగా ఏ వారానికి ఆ వారం ఏపీ ప్రభుత్వంలోని కీలక అధికారులు.. నేతలు దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ ప్రదిక్షనాలు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఢిల్లీకి వెళ్లారు. ఈసారి మాత్రం వారి టూర్ పాజిటివ్ గా సాగలేదు. అనుకోని రీతిలో ఏపీ ప్రభుత్వం అడిగిన అప్పునకు కేంద్రం మోకాలు అడ్డు పెట్టింది.
ఓపక్క పరిమితులకు మించి అప్పు చేస్తున్న ఏపీకి ఇవ్వాల్సిన అప్పుల పరిమితిలో రూ.17వేల కోట్లు కోత విధిస్తారని చెప్పారు. కానీ..అలాంటిదేమీ లేకుండానే జగన్ సర్కారుకు కేంద్రం తన సహకారాన్ని అందించింది. మొత్తానికి ఏపీకి అవసరమైన నిధుల్ని అప్పుల రూపంలో సమీకరించుకొని.. పప్పు బెల్లాల మాదిరి పంచేస్తున్న వైనం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు.. ఓవైపు అప్పుల గురించి సీరియస్ వ్యాఖ్యలు చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వం కోరినట్లుగా అప్పులు ఇచ్చే ధోరణి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఏపీ తీసుకొచ్చిన అప్పు రూ.లక్ష కోట్ల మార్కును దాటేసినట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.