Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ సీఈవోకు కేంద్ర ఆర్థికశాఖ నోటీసులు?

By:  Tupaki Desk   |   22 Aug 2021 10:00 PM IST
ఇన్ఫోసిస్ సీఈవోకు కేంద్ర ఆర్థికశాఖ నోటీసులు?
X
దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో అయిన సలీల్ పరేఖ్ కు భారత ఆర్థిక మంత్రిత్వశాఖ సమన్లు జారీ చేయడం సంచలనమైంది. కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ప్రారంభమై రెండున్నర నెలలు అయినా అవాంతరాలను ఎందుకు పరిష్కరించట్లేదని వివరించడానికి ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 2021 ఆగస్టు 23న తమ కార్యాలయానికి రావాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది.

ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఐటీశాఖ కొత్తగా అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఈ-ఫైలింగ్ పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఆదాయపు పన్ను శాఖ ప్రతిష్టాత్మకంగా రంగంలోకి తీసుకు వచ్చిన ఈ ఫైలింగ్ లో అనేక ఇబ్బందులు ఉన్నట్లుగా ఆ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వ్యక్తులు దీని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.

పన్ను చెల్లింపుదారుల సమస్యను అర్థం చేసుకున్నామని.. ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్ పనిచేయకపోవడం వల్ల వారు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఢిల్లీ హైకోర్టుకు వినియోగదారులు ఫిర్యాదు చేశారు.