Begin typing your search above and press return to search.

య‌న‌మ‌లా... ఇంకేం అధ్య‌య‌నం చేస్తారండీ?

By:  Tupaki Desk   |   1 Feb 2018 11:24 AM GMT
య‌న‌మ‌లా... ఇంకేం అధ్య‌య‌నం చేస్తారండీ?
X
న‌రేంద్ర మోదీ స‌ర్కారు త‌న ఐదేళ్ల పాల‌న‌కు సంబంధించి చిట్ట చివ‌రి బ‌డ్జెట్‌ ను నేటి ఉద‌యం పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ 2018-19 వార్షిక బ‌డ్జెట్‌ ను లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌ లో తెలుగు నేల‌కు - ప్ర‌త్యేకించి ఏపీకి పెద్ద‌గా లాభిస్తుంద‌ని, భారీ ఎత్తున కేటాయింపులు ఉంటాయ‌ని ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటుగా స‌గ‌టు ఏపీ ప్ర‌జ‌లు కూడా భావించారు. ఎందుకంటే... 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించి ఉంటార‌ని, ఈ క్ర‌మంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి భారీగానే ఊర‌ట ల‌భించే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపించింది. అయితే అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందుల‌య్యాయి. ఎప్ప‌టిలానే న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఏపీకి గుండు సున్నా చుట్టేసింది. గ‌తంలో ప్ర‌క‌టించిన కేటాయింపుల కంటే కూడా ఈ బ‌డ్జెట్లోనే త‌క్కువ కేటాయింపులు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో మోదీ స‌ర్కారు తీరుపై ఏపీ వ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప‌రిస్థితిని అర్థం చేసుకున్న టీడీపీ అధినేత‌. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా త‌న పార్టీ ఎంపీల‌ను అల‌ర్ట్ చేసేశారు. ఏపీకి ఏమాత్రం ఆశించిన కేటాయింపులు లేవ‌న్న విష‌యాన్ని నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి తెలియ‌జేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో ఏపీ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా మీడియా ముందుకు వ‌చ్చేసిన ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఏమీ లేవ‌ని చెబుతూనే ఆయ‌న చేసిన ఓ ప్ర‌క‌ట‌న మీడియా ప్ర‌తినిధుల‌తో మాట పాటు త‌న మాట విన్న వారంద‌రినీ య‌న‌మ‌ల షాక్‌కు గురి చేశార‌ని చెప్పాలి. కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌తులు ఇంకా త‌న‌కు అంద‌లేద‌ని - ఆ ప్ర‌తులు అందిన వెంట‌నే దానిని అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత గానీ... కేంద్ర బ‌డ్జెట్లో ఏపీకి ఏం ద‌క్కాయో - ఏ మేర‌కు అన్యాయం జరిగింద‌న్న విష‌యంపై ఓ అవగాహ‌న‌కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయినా అరుణ్ జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఏపీ మాటే వినిపించ‌లేద‌ని స్వ‌యంగా చెబుతూనే... ఇంకా బ‌డ్జెట్ ను స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయాల్సి ఉంద‌ని య‌న‌మ‌ల చెబుతున్న తీరు నిజంగానే ఆశ్చ‌ర్య‌కరంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా య‌న‌మల ఏం వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... *బడ్జెట్‌ ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరముంది. ఏపీకి సంబంధించిన అంశాలు బడ్జెట్‌ లో ప్రస్తావించలేదు. విశాఖపట్నం - విజయవాడ మెట్రో రైలుపై బడ్జెట్‌ లో ఉందో లేదో చూడాలి. కర్నాటక ఎన్నికల వల్లే బెంగళూరుకు మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి స్కీమ్ చదివితే చదివితే రాష్ట్రానికి ఏమి ఉన్నాయో - ఏం లేవో తెలుస్తుంది. బడ్జెట్ స్పీచ్ వేరు - అందులో పొందుపర్చిన అంశాలు వేరు. ముందస్తు ఎన్నికలు వస్తే కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్* అని య‌న‌మ‌ల వ్యాఖ్యానించారు.