Begin typing your search above and press return to search.

అడ్డంగా దొరికిన నిర్మల.. ఆడుకున్న కేటీఆర్.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   30 Jun 2022 2:40 PM GMT
అడ్డంగా దొరికిన నిర్మల.. ఆడుకున్న కేటీఆర్.. వీడియో వైరల్
X
నేతలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి నోటి నుంచి ఠంగ్ స్లిప్ అయితే ఇక వెనక్కి తీసుకోవడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. అందుకే ఆచీతూచి మాట్లాడాలని అంటారు. రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా మాటల విషయంలో సంయమనం పాటించాలి. అది కరువైతే ఇలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లా అభాసుపాలు అవుతుంటారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జీఎస్టీ పెంపులో భాగంగా ‘గుర్రపు పందేలా’పై జీఎస్టీ గురించి మాట్లాడేటప్పుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్ ట్రేడింగ్ పై జీఎస్టీ అన్నారు. దీన్ని ప్రతిపక్షాలు అందిపుచ్చుకొని ఆమెను ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నాయి.

మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేల రగడ, బేరసారాలు, రాజకీయ సంక్షోభం రగులుతున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకున్న నెటిజన్లు ఒక రేంజ్ లో విమర్శిస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు ఈ వీడియో క్లిప్ ను షేర్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ప్రూడియన్ స్లిప్, మనసులో మాట అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాదు హార్స్ ట్రేడింగ్ పై జీఎస్టీ అనేదే నిజమైతే.. బీజేపీనే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు సామాన్య ప్రజలు ఇక పన్నులు కట్టాల్సిన అవసరమే లేదంటూ విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా అందిపుచ్చుకున్నాడు. నిర్మల వీడియోపై సెటైర్లు వేశారు. దీన్నే ఇంగ్లీష్ లో ‘ప్రూడియన్ స్లిప్’ అని అంటారని.. హిందీలో మన్ కీ బాత్ అంటారంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

జీఎస్టీ కౌన్సిల్ ప్రెస్ మీట్ లో నిర్మలా సీతారమన్ ‘హార్స్ రేసింగ్’కు బదులు హార్స్ ట్రేడింగ్ అంటూ నోరుజారారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click Here for Video : https://twitter.com/KTRTRS/status/1542380629421043712?s=20&t=uTbppvD6VyjPVUk_Ai1pQQ