Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకోవడానికి కేంద్రం కొత్త రూల్స్

By:  Tupaki Desk   |   1 Feb 2020 12:30 PM GMT
పెళ్లి చేసుకోవడానికి కేంద్రం కొత్త రూల్స్
X
పెళ్లీడుకొచ్చిన సంతానానికి అంగరంగ వైభవంగా పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు భారీగా ఖర్చు చేస్తుంటారు. పైసలు నీళ్లలా ఖర్చుచేస్తుంటారు. కొంతమంది భారం దించుకోవడానికి ఏకంగా 18 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి చేస్తారు.

అయితే తాజాగా పెళ్లీడుకు వచ్చే అమ్మాయిలకు త్వరగా పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులకు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా షాకిచ్చారు. పెళ్లి చేయడానికి మహిళలకు ఇప్పటివరకూ నిర్ణయించిన 18 ఏల్ల వయసును కాస్త పెంచాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

మరో ఆరునెలల్లో టాస్క్ ఫోర్స్ వచ్చాక మహిళ కనీస పెళ్లి వయసును పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు.

దీంతో ఇప్పటికే అమ్మాయిలు దొరక్క.. పెళ్లిళ్లు మూడు పదులకు అవుతున్నాయి. ఇప్పుడు కేంద్రం కనుక అమ్మాయిల కనీస వయసును పెంచితే పెళ్లిళ్లు మరింత ఆలస్యం కావడం ఖాయం. 18 ఏళ్ల వయసు పెంచే నిర్ణయం తీసుకోవడం తల్లిదండ్రులకు షాకింగ్ గానే చెప్పవచ్చు.