Begin typing your search above and press return to search.

ఇక ఆ ట్రోల్స్‌ కు ఎండ్‌ కార్డ్‌ పడ్డట్టేనా?

By:  Tupaki Desk   |   23 Dec 2022 10:07 PM IST
ఇక ఆ ట్రోల్స్‌ కు ఎండ్‌ కార్డ్‌ పడ్డట్టేనా?
X
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆయనకు బాగా ఇబ్బందులు సృష్టించిన అంశాల్లో ఒకటి రోడ్లు, రెండు పులివెందుల బస్టాండ్‌. జగన్‌ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోవడం లేదని.. ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నా.. వందల సంఖ్యలో గాయపడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రోడ్ల అంశంపై ఇప్పటికే పలు రకాల మీమ్స్, ట్రోల్స్‌ కూడా భారీ ఎత్తున నడిచాయి.

అలాగే సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల బస్టాండ్‌ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2020 డిసెంబర్‌లో కొత్త బస్‌ టెర్మినల్‌ నిర్మాణాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు. త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల బస్టాండ్‌ నిర్మాణం ఆలస్యమవడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వాన్ని ట్రోల్‌ చేసింది. దీంతో పాత పులివెందుల బస్టాండ్‌ను ప్రయాణికులకు మూసి వేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

డిసెంబర్‌ 23 నుంచి తన సొంత జిల్లా కడపలో మూడు రోజుల పాటు సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తన సొంత నియోజకవర్గం పులివెందులలోనూ సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త బస్‌ టెర్మినల్‌ను పులివెందులలో సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త బస్‌ టెర్మినల్‌ ను ప్రారంభోత్సవానికి అనుకూలంగా అధికారులు సిద్ధం చేస్తున్నారు.

రూ.34 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఇది ఆసియాలోనే అతిపెద్ద బస్‌ టెర్మినల్‌ అని ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జున రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు ఈ వారం ప్రారంభంలో ఆయన పనులను పరిశీలించారు. నాలుగు ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ బస్‌ టెర్మినల్‌లో మల్టీప్లెక్స్, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, అనేక బస్‌ బేలు ఉన్నాయి.

కాగా పులివెందుల కొత్త బస్‌ టెర్మినల్‌ రెండు చిత్రాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఒకటి అంతకుముందు ట్రోలింగ్‌ గురైనది. అది ఒక రోడ్డు పక్కన ఉంది. మరొకటి ఆధునికీకరించిన బస్టాండ్‌. ఇపుడు ఈ కొత్త బస్టాండ్‌ నే సీఎం జగన్‌ ప్రారంభించబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.