Begin typing your search above and press return to search.

బాలాపూర్ లడ్డూ వేలాన్ని బ్రేక్ చేసిన ఫిలింనగర్ లడ్డూ వేలం

By:  Tupaki Desk   |   13 Sept 2019 10:45 AM IST
బాలాపూర్ లడ్డూ వేలాన్ని బ్రేక్ చేసిన ఫిలింనగర్ లడ్డూ వేలం
X
వినాయకచవితి వచ్చిందంటే చాలు.. భారీ ఎత్తున వెలిసే పందిళ్లు ఎంత ఫేమస్సో.. నవరాత్రుల చివర్లో నిర్వహించే లడ్డూ వేలాలు కూడా అంతే ఫేమస్. నిమజ్జన వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు బాలాపూర్ లో నిర్వహించే లడ్డూ వేలం మీదనే ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదు.

ఇక్కడి లడ్డూను సొంతం చేసుకోవటానికి లక్షల్లో ఖర్చు చేయటానికి సైతం వెనుకాడరు. గడిచిన కొన్నేళ్లుగా భారీ ఎత్తున వేలంలో ధర పలికే బాలాపూర్ లడ్డూ వేలం రికార్డును బ్రేక్ చేసింది ఫిలింనగర్ వినాయక నగర్ లోని లడ్డూ వేలం. బాలాపూర్ లడ్డూ వేలం గురువారం ఉదయం రికార్డుస్థాయిలో రూ.17.60 లక్షల వేలం వెళ్లగా.. దాన్ని అధిగమిస్తూ వినాయక నగర్ లడ్డూ వేలం చేరుకొంది.

ఈ బస్తీలో నిర్వహించిన లడ్డూ వేలం ఏకంగా రూ.17.75 లక్షల ధర పలికి కొత్త రికార్డు క్రియేట్ అయ్యేలా చేసింది. మరింత భారీ మొత్తాన్ని చెల్లించింది ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చెక్ చేస్తే.. బీజేపీ నేత గోవర్థన్ లడ్డూ వేలాన్ని పీక్స్ కు తీసుకెళ్లి సొంతం చేసుకున్నారు.

బాలాపూర్ లడ్డూ వేలానికి కేవలం రూ.15వేలు అదనంతో ఈసారి ఫస్ట్ ప్లేస్ కు వెళ్లింది. వాస్తవానికి గత ఏడాది వినాయక్ నగర్ లడ్డూ వేలం రెండో అత్యధిక మొత్తం పలికి అందరి చూపు తన మీద పడేలా చేసుకోగలిగారు. తాజా వేలంతో తాను మొదటిస్థానంలో ఉండటం ద్వారా.. ఫిలింనగర్ వినాయకనగర్ బస్తీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చేలా చేసింది.