Begin typing your search above and press return to search.
శ్రీకాకుళంలో 3 జిల్లాల కోసం పోరాటం
By: Tupaki Desk | 12 Sept 2020 5:00 PM ISTఏపీలో జిల్లాల విభజన వేడి పుట్టిస్తోంది. సీఎం జగన్ వేసిన అధికారుల కమిటీ ఇప్పటికే పని మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తమకు ఈ జిల్లా కావాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. రాయచోటి జిల్లా కోసం ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నిన్న గళం కూడా వినిపించారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా విభజనపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు 70 ఏళ్ల చరిత్ర ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళంగా 1950లో విడిపోయింది. అయితే 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి భూభాగాలను విడగొట్టి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాను రెండు జిల్లాలు చేయాలని అధికారుల కమిటీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రణాళిక ప్రకారం పార్లమెంట్ నియోజక వర్గాల ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేయాలి. అయితే సిక్కోలు జిల్లాను ఇప్పుడు మూడు జిల్లాలు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. కొంత మంది మా జిల్లాను విడగొట్టవద్దు.. ఒకటే జిల్లాను ఉంచాలని కోరుతున్నారు.
టెక్కలి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఒక సాధన సమితి పోరాటం మొదలు పెట్టింది. ఇక ఒడిశా సరిహద్దుకు ఆనుకొని ఉన్న పాలకొండను కొత్త జిల్లా చేయాలని ఇంకో సాధన సమితీ పుట్టుకొచ్చింది.
ఇక రాజాం, ఎచ్చెర్ల నియోజక వర్గాల ప్రజలు తమను విజయ నగరంలో కలుప వద్దంటున్నారు. కొత్త జిల్లా చేయాలంటున్నారు. ఇలా శ్రీకాకుళంలో ప్రస్తుతానికి శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ అనే మూడు జిల్లాల కోసం పోరాటం మొదలైందని చెబుతున్నారు.