Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ ఛానెల్స్ లేడీ యాంక‌ర్లు కొట్టుకున్నారా? ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   3 Aug 2021 8:30 AM GMT
ప్ర‌ముఖ ఛానెల్స్ లేడీ యాంక‌ర్లు కొట్టుకున్నారా?  ఎందుకో తెలుసా?
X
ఇటీవ‌ల కాలంలో ఛానెళ్ల‌లో ప‌నిచేసే యాంక‌ర్ల‌కు ప‌బ్లిక్ ఫోక‌స్ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. సెల‌బ్రిటీలుగా స‌మాజంలో గుర్తింపు కోసం త‌హ‌త‌హ లాడుతున్నారు. ఇక, ఈ సెల‌బ్రిటీలుగా గుర్తింపు కోసం.. యాంక‌ర్లు ఒకరిని మించి ఒక‌రు .. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఛానెల్ అధినేత‌ల‌ను మ‌చ్చిక చేసుకునే వారు కూడా ఉన్నార‌ని ఇటీవ‌ల కాలంలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇంకొంద‌రు .. త‌మ ప‌ని ఆధారంగా.. ప్రొమోషన్లు పొందుతున్నారు.

మ‌రికొంద‌రు యాంక‌ర్లు.. క్యాస్ట్‌, సిఫార‌సుల‌తో గుర్తింపు పొందుతున్నారు. ఇక‌, మీడియా అన్నాక‌.. అన్ని విషయాలు క‌ల‌గాపులగంగానే ఉంటున్నాయ‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. ఎంత స‌బ్జెక్ట్ ఉన్న‌ప్ప‌టికీ.. సిఫార‌సులో.. క్యాస్టో లేక‌పోతే.. పైకిరాలేం! అనే భావ‌న‌.. ఇప్పుడు మీడియాలో జోరుగా వినిపిస్తోంది. దీంతో సీనియ‌ర్లుల‌.. జూనియ‌ర్లు అనే మాట లేకుండా.. ఎవ‌రికివారు.. పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌య త్నాలు.. అన్నిసార్లూ సాఫీగానే వెళ్లిపోతున్నా.. కొన్ని సార్లు మాత్రం వివాదాల‌కు కేంద్రాలుగా మారుతున్నాయి.

ఇలాంటిదే.. ఒక ర‌గ‌డ తాజాగా చోటు చేసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్‌లో లేడీ యాంక‌ర్ల మ‌ధ్య ఏర్ప‌డిన ఆధిప‌త్య ర‌గ‌డ‌.. కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింద‌ని తెలుస్తోంది. త‌ను సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ.. జూనియ‌ర్ యాంక‌ర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే భావ‌న‌తో ర‌గిలిపోయిన సీనియ‌ర్ యాంక‌ర్‌కు, తాను జూనియ‌ర్ అయితే ఏంటి.. ప్రాధాన్యం ఇవ్వ‌కూడ‌దా? అనే యాంగిల్‌లో ఆలోచించిన జూనియ‌ర్ యాంక‌ర్ ఇద్ద‌రూ.. అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డేస‌రికి ర‌క్తాలు వ‌చ్చే వ‌ర‌కు కొట్టుకునే ప‌రిస్థితి తెచ్చుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న మీడియా స‌ర్కిళ్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏదేమైనా.. రంగం ఎలాంటిదైనా.. పోటీ ఉండాలే త‌ప్ప‌.. పొట్లాట‌లు.. స‌రికాద‌న్న‌ది.. విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.