Begin typing your search above and press return to search.

ఐదో విడతలో అతిరథులు!

By:  Tupaki Desk   |   5 May 2019 6:28 AM GMT
ఐదో విడతలో అతిరథులు!
X
బీజేపీ - కాంగ్రెస్ - సమాజ్‌ వాదీ పార్టీ నుంచి అతిరథ మహారథులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు - కేంద్రమంత్రులు - మాజీ మంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌ బరేలీలో ఈసారి కూడా కాంగ్రెస్‌ తరఫున సిట్టింగ్‌ ఎంపీ సోనియాగాంధీ పోటీ చేస్తున్నారు. అయితే గతంలో ఇందిరాగాంధీని ఓడించిన నియోజకవర్గ ప్రజలు ఈసారి సోనియాగాంధీకి కూడా ఓటమి రుచి చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈమేరకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకులకు గాలం వేసి ఎమ్మెల్సీ ప్రతాప్‌ సింహాకు బరిలో దింపారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈక్రమంలో సోనియాగాంధీ గెలుపు కష్టసాధ్యమని సమాచారం.

రాహుల్‌ కు ఓటమి భయం పట్టుకుందా?

అమేథీలో గత మూడు పర్యాయాలుగా విజయం సాధించిని రాహుల్‌ గాంధీకి ఈసారి ఓటమి భయం పుట్టుకుందని తెలుస్తోంది. ఫలితంగా కేరళలోని వయనాడ్‌ పోటీ చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి భారీ మద్దతు ఉండటంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఓటమి భయం పట్టుకుని రెండోస్థానం ఎంచుకున్నట్లు విమర్శలు కూడా ఉన్నాయి.

2014 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన స్మృతీ ఇరానీ కేవలం లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అనంతరం రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా సేవలు అందించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ మద్దతు చేకూరింది. రెండు పార్టీల నుంచి సమ ఉజ్జీలు పోటీ పడటంతో హైఓల్టేజీ నియోజకవర్గాల జాబితోకి అమేధీ కూడా చేరింది.

పోటీలో ఉన్న ప్రముఖులు

– కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియాగాంధీ
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
– కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ
– కేంద్రమంత్రి రాజనాథ్‌ సింగ్‌
– కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి
– కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద్‌
– శతృఘ్న సిన్హా సతీమణి పూనమ్‌ సిన్హా