Begin typing your search above and press return to search.

మాజీ ఎమ్మెల్యే ఆమాంచికి షాకిచ్చిన మహిళా ఎస్పీ

By:  Tupaki Desk   |   28 May 2020 7:30 AM GMT
మాజీ ఎమ్మెల్యే ఆమాంచికి షాకిచ్చిన మహిళా ఎస్పీ
X
జడ్జీల పై సోషల్ మీడియాలో బయటా వ్యాఖ్యానించిన అధికార వైసీపీ నాయకులకు తాజాగా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చి మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులను కించపరిచేలా మాట్లాడినందుకు ఓ లాయర్ పిటీషన్ దాఖలు చేయగా ఈ చర్య తీసుకుంది.

నోటీసులు అందుకున్న వారిలో వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ సహా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులున్నారు. దీనిపై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

కాగా తాజాగా తెలుగు నంబర్ 1 న్యూస్ చానెల్ లో ఇదే విషయంపై ఆమంచిని చర్చకు పిలిచారు. ఈ చర్చలో సీఐడీ మహిళా ఎస్పీ రాధిక కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమంచి ఫొన్టో మాట్లాడుతూ హైకోర్టు నోటీసులపై కామెంట్స్ చేయబోయారు. దీనికి మహిళా ఎస్సీ రాధిక అభ్యంతరం తెలిపారు.

కోర్టు తీర్పులపై చర్చ పెట్టడం.. మాట్లాడడం.. ఏ ఒక్క మాట మాట్లాడినా అది కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని తాను చర్చ నుంచి వైదొలుగుతానని సీఐడీ మహిళా ఎస్సీ రాధిక లైవ్ లోనే షాకిచ్చారు.

దీంతో సదురు చానెల్ జర్నలిస్టు వెంటనే ఆమంచి ఫోన్ కట్ చేసి కోర్టులతో వ్యవహారం వద్దని సీఐడీ ఎస్పీ రాధిక చెప్పినట్టు చేశారు. దీంతో మహిళా ఎస్పీ రూల్స్ కు ఏకంగా మాజీ ఎమ్మెల్యే గొంతు కూడా చానెల్ నొక్కేసిన వైనం చర్చనీయాంశమైంది. చానెల్ సీనియర్ జర్నలిస్టు కూడా కోర్టుల తీర్పు పై చర్చను ముగించడం విశేషం.