Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్.. 0 శాతం వడ్డీకే రుణాలు

By:  Tupaki Desk   |   17 March 2020 2:00 AM IST
కరోనా ఎఫెక్ట్.. 0 శాతం వడ్డీకే రుణాలు
X
కరోనాను అడ్డుకోవడానికి ప్రపంచదేశాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. దీనివల్ల కలిగే ఆర్థిక ముప్పునూ అంచనా వేసుకుని మరికొన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా మరణాల లిస్టులో మొదటి వరుసలో ఉన్న అమెరికా ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్తపై ఈ ప్రభావం పడకుండా చర్యలు చేపడుతోంది. ఆ క్రమంలోనే వడ్డీ రేట్లలను తొలగించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కనిష్ఠ స్థాయిలో 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేటును సున్నా శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదివారం నాడు అత్యవసరం గా సమావేశమైన యూఎస్ పెడ్, కరోనా ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా తరువాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, అమెరికా వడ్డీ రేట్లను సున్నా శాతానికి మార్చింది. ఆపై మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

యూఎస్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా 700 బిలియన్ డాలర్ల ట్రెజరీ నిధులను వెచ్చించనున్నట్టు కూడా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ చెప్పారు. యూఎస్ ఫెడ్ నిర్ణయంతో రిటైల్ ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేసినప్పటికీ, నాస్ డాక్, డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం చతికిల పడ్డాయి. ఈ ప్రకటన రాగానే, తదుపరి సెషన్ లో 5 శాతం వరకూ పతనం ఉండవచ్చన్నట్టుగా మార్కెట్ సూచీలు చూపుతున్నాయి.