Begin typing your search above and press return to search.

రాహుల్ నోట మోడీ జైలుమాట‌!

By:  Tupaki Desk   |   21 April 2019 3:57 PM IST
రాహుల్ నోట మోడీ జైలుమాట‌!
X
రాజ‌కీయంగా స‌వాల‌చ్చ ఉండొచ్చు. త‌ప్పులు చేసి ఉండొచ్చు. కానీ.. చ‌ట్టం దృష్టిలో నేరం నిరూపిత‌మ‌య్యే వ‌ర‌కూ ఆ వ్య‌క్తిని దోషిగా భావించలేం. నిందితుడిగా మాత్ర‌మే చెప్ప‌గ‌లం. అలాంటిది దేశ ప్ర‌ధాని స్థానంలో ఉన్న ఒక వ్య‌క్తి మీద ఆరోప‌ణ‌లు చేయ‌టం వ‌ర‌కూ ఓకే. కానీ.. ప్ర‌ధాని సీట్లో కూర్చున్న నేత‌.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే జైలుకు వెళ‌తామ‌న్న వ్యాఖ్య‌లు చేయ‌టం తొంద‌ర‌పాటే అవుతుంది. తాజాగా అలాంటి వ్యాఖ్యే చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.

వ్య‌వ‌స్థ‌ను గౌర‌వ‌ప్ర‌దంగా న‌డిచేలా చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. దానికి బోలెడ‌న్ని స‌వాళ్లు ఉంటాయి. ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. ఎన్నిక‌ల ఫ‌లితం ఆధారంగా రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుందో చెప్పేయ‌టం అత్యుత్సాహ‌మే అవుతుంది. రాఫెల్ ఒప్పందంలో కుంభ‌కోణం చోటు చేసుకుంద‌ని రాహుల్ గాంధీ మొద‌ట్నించి వేలెత్తి చూపిస్తున్నారు.

ఆ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ఆధారాల‌న్నీ చూస్తే.. రాఫెల్ డీల్ లో ఏదో తేడా జ‌రిగింద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. అంత‌మాత్రానికే ఏదో జ‌రిగిపోయింది కాబట్టి.. జైలుకు వెళ్లాల్సి రావ‌ట‌మే త‌రువాయి అన్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌టం రాహుల్ గాంధీకి అంత ముఖ్య‌మైన విష‌యమా?అన‌్న ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రాఫెల్ డీల్ మీద విచార‌ణ చేప‌డ‌తామ‌న్నారు. ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌చ్ఛితంగా జైలుకు వెళ్లాల్సిన వ‌స్తుంద‌ని ధీమాగా కామెంట్ చేయ‌టం తొంద‌ర‌పాటే అవుతుంది.

ది హిందూ ప‌త్రిక బ‌య‌ట‌పెట్టిన ప‌త్రాల్లో మోడీ పాత్ర స్ప‌ష్ట‌మైంద‌న్న రాహుల్..మోడీని జైలుకు పంప‌టానికి ఆ ఆధార‌లు ఒక్క‌టి చాలంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

మోడీ ప్ర‌భుత్వం పారిశ్రామిక‌వేత్త‌ల మేలు కోసం మాత్ర‌మే న‌డుస్తుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. నిరుద్యోగం.. రైతాంగ స‌మ‌స్య‌లు.. మోడీ హ‌యాంలో మ‌రింత పెరిగాయ‌న్నారు. మిగిలిన విమ‌ర్శ‌ల‌న్నీ రాజ‌కీయాల్లో రోటీన్ గా చోటు చేసుకునేవే. కానీ.. ఎన్నిక‌ల్లో ఓడిపోతే.. జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌న్న మాట‌లు అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లుగా వైర‌ల్ అవుతాయి. అదే జ‌రిగితే.. రాహుల్ కు న‌ష్టం వాటిల్ల‌టం ఖాయం. ఇప్పుడున్న దూకుడు రాజ‌కీయాల్లో త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులపై ప‌గ‌.. ప్ర‌తీకారం పేరుతో ఇబ్బందికి గురి చేయ‌టం తెలిసిందే. రాహుల్ తాజా వ్యాఖ్య‌లు సైతం ఇదే కోవ‌కు వ‌చ్చేలా ఉన్నాయ‌న్న‌ అభిప్రాయం ఉంది. కింది స్థాయి రాజ‌కీయాల్లో మాదిరి నోరు పారేసుకోవ‌టం రాహుల్ లాంటి స్థాయి ఉన్న నేత‌ల‌కు స‌రికాదు. ఆ విష‌యాన్ని ఆయ‌న ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.