Begin typing your search above and press return to search.
ఎదురు ప్రశ్నలతో పోలీసులకే షాక్
By: Tupaki Desk | 31 Oct 2015 12:44 PM ISTదాదాపు 49వేల అమ్మాయిల డేటాను సేకరించి.. వారి ఫోన్ నెంబర్లతో వల పన్ని.. దాదాపు 500 మంది వరకు అమ్మాయిల్ని ట్రాప్ చేసిన మోసగాడు మధు వ్యవహారశైలి పోలీసులకు షాకిస్తోందట. లా పట్టా ఇతగాడి వైఖరి ఒక పట్టాన అర్థం కావటం లేదని విచారణ అధికారులు చెబుతున్నారు. తనపై ఉన్న ఆరోపణల విషయంలో తొణక్కుండా.. బెణక్కుండా వ్యవహరిస్తూ పోలీసులకు చికాకు తెప్పిస్తున్నాడట.
ఇతని ఇంటిని.. కార్యాలయాన్ని తనిఖీ చేసి పెద్ద ఎత్తున డేటాను సేకరించిన పోలీసులు.. మరింత సమాచారం కోసం కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని విచారిస్తున్నారు. అయితే.. విచారణ సందర్భంగా పోలీసులు ప్రశ్నించే దానికి సమాధానం కంటే ఎదురు ప్రశ్నలే ఎక్కువగా వేస్తున్నాడట. తొలి రెండు రోజులు విచారణ సాఫీగా సాగుతున్నా.. తర్వాత నుంచి రూట్ మార్చాడని చెబుతున్నారు.
తాను ఎవరినీ మోసం చేయలేదని.. బలవంతం కూడా చేయలేదని.. అలాంటప్పుడు తనను తప్పు చేసినట్లుగా అడగటమేమిటని ప్రశ్నిస్తున్నాడట. తాను ఎవరినీ బలవంతం చేయలేదని.. అత్యాచారం చేసింది కూడా లేదని.. అలాంటప్పుడు తాను చేసింది తప్పు ఎలా అవుతుందన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారట. లా పట్టా పొందిన ఇతగాడితో మా డేంజర్ అని విచారణ అధికారులు వాపోతున్నారట.