Begin typing your search above and press return to search.

స్టేడియంలో సెక్స్ డాల్స్ పెట్టిన ఫుట్ బాల్ టీం

By:  Tupaki Desk   |   21 May 2020 1:30 PM GMT
స్టేడియంలో సెక్స్ డాల్స్ పెట్టిన ఫుట్ బాల్ టీం
X
ప్రస్తుత మహమ్మారి విజృంభణతో ఆటలన్నీ ఆగిపోయాయి. క్రికెట్, ఫుట్ బాల్ సహా అన్ని క్రీడలు వాయిదా పడ్డాయి. కొన్ని దేశాల్లో ప్రేక్షకులు లేకుండానే క్రీడాకారులు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతున్నారు. వాటినే లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. స్టేడియాలు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

తాజాగా దక్షిణ కొరియాలో కె-లీగ్ లో ఎఫ్.సీ. సియోల్ టీమ్ వినూత్నఆలోచన చేసింది. ఫుట్ బాల్ స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడంతో వారి స్థానంలో వందలాది మంది సెక్స్ డాల్స్ (ఆడ సెక్స్ బొమ్మలను) కూర్చోబెట్టింది. మహ్మమారి వైరస్ తో ప్రేక్షకులు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్మాయంగా వీటిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే గ్వాంగ్జు ఎఫ్.సీ-ఎఫ్.సీ సియోల్ మధ్య మ్యాచ్ జరిగింది. స్టేడియంలో ప్రేక్షకుల స్థానంలో ఈ సెక్స్ టాయ్స్ చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు.

స్టేడియంలో సెక్స్ డాల్స్ పెట్టి ఫుట్ బాల్ ఆడడం.. ఆ ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో అందరూ విమర్శలు గుప్పించారు. ఇదేం పాడుపని అని తిట్టిపోశారు. చీపాడు అంటూ సదురు నిర్వాహకులపై మండిపడ్డారు.

దీంతో ఎఫ్.సీ సీయోల్ టీం ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. సప్లయిర్ దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ టాయ్స్ పంపించాడని.. ఆ బొమ్మలను పొరపాటున అక్కడ పెట్టారని వివరణ ఇచ్చింది.

ఇక ఇకొందరు అయితే సెక్స్ డాల్స్ స్టేడియంలో ఉంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఫుట్ బాల్ ఆటగాళ్ల వాడే సెక్స్ టాయ్స్ ను తీసుకొచ్చారా అని మరికొందరు ఎద్దేవా చేశారు. మొత్తానికి ఈ పనిచేసిన ఎఫ్.సీ సీయోల్ టీం మాత్రం అడ్డంగా బుక్కైంది.