Begin typing your search above and press return to search.

మరో బాంబు పేల్చిన ఫౌచీ... 33 శాతం కేసులు ఆ వేరియంట్ తోనే !

By:  Tupaki Desk   |   23 March 2022 5:00 AM IST
మరో బాంబు పేల్చిన ఫౌచీ... 33 శాతం కేసులు ఆ వేరియంట్ తోనే !
X
కరోనా వైరస్ కు సంబంధించిన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా లోని అంటువ్యాధి నిపుణులు ఆంటోని ఫౌచీ. ప్రపంచ దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫౌచీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కోవిడ్ కేసుల సంఖ్య మరోసారి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఫౌచీ. దీనికి ప్రధాన కారణం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అని చెప్తున్నారు.

మరి కొద్ది రోజుల్లో ఒమిక్రాన్ కేసులు మరోసారి భారీగా పెరుగుతాయని అంటున్నారు. దీంతో అధికార వర్గాల్లో మరోసారి కలవరం మొదలు అయ్యింది. దీంతో కొవిడ్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఫౌచీ చెప్పినట్లుగా కేసులు భారీగా పెరుగుతాయా అని అంటే మిగతా వారు కూడా పెరుగుతాయి అని అంటున్నారు. ఒమిక్రాన్ కు సులభంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని అంటున్నారు.

ప్రపంచ దేశాల మాట అటు ఉంచితే కరోనా ప్రభావం అమెరికాలో కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్తున్నారు ఫౌచి. వివిధ దేశాల్లో కరోనా వైరస్ విస్తరించినట్లు గానే అమెరికాలో కూడా వైరస్ కేసులు భారీగా నమోదు అవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి విడతల వారీగా వస్తున్న వేరియంట్లలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

దీంతో మరోసారి అమెరికాలో కేసులు ఎక్కువగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్ లోని సబ్ వేరియంట్ బీఏ.2 తో కొవిడ్ కేసులు మరింత ప్రబలం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు ఫౌచీ. ఈ సబ్ వేరియంట్ కు ఉండే ప్రధాన లక్షణం ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం. దీంతో కేసులు కుప్పలు తెప్పలుగా వస్తాయని అంటున్నారు.

అయితే కొవిడ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్లలో కంటే డెల్టా చాలా ప్రమాదకరమైంది అని చాలా మంది పరిశోధకులు అంటున్నారు. అలాగే కొవిడ్ నుంచి ఒమిక్రాన్ వేరియంట్ కూడా చాలా త్వరగా మనుషులకు వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తెలిపారు.
అయితే ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేశారు ఫౌచీ... ప్రస్తుతం ఆయన చెబుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఏ.2 కు ఒమిక్రాన్ కంటే ఇంకా వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఉంటుందని చెబుతున్నారు. సుమారు ఒమిక్రాన్ తో పోల్చితే 60 శాతం వేగంగా వ్యాప్తి చెంద గలిగే సామర్థ్యం దానికి ఉన్నాయని ఫౌచీ అన్నారు. దీనిని బట్టి బీఏ.2 వ్యాప్తి ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.

దీనికి తోడు ఫౌచీ అమెరికన్లకు మరో బాంబు పేల్చారు. ప్రస్తుతం అమెరికాలో వెలుగు చూస్తున్న కేసుల్లో సుమారు 33 శాతం కేసులు సబ్ వేరియంట్ కు చెందినవే అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు లేని విధంగా బీ ఏ వేరియంట్ తో ఎక్కువ కేసులు అమెరికాలో రాబోతున్నాయని ఫౌచీ అన్నారు. ఇదిలా ఉంటే ఈ వేరియంట్ కు సంబంధించిన కేసులు యూరప్ లో కూడా నమోదు అవుతున్నాయని అంటున్నారు ఆయా దేశాల అధికారులు.