Begin typing your search above and press return to search.
ఫాస్టుఫుడ్ తింటే సెక్స్ విషయంలో దెబ్బైపోతారు..
By: Tupaki Desk | 25 Feb 2020 8:32 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం కూడా మారుతూ వస్తోంది. ఎవరికీ వాళ్లు బీజీ లైఫ్ కు అలవాటు పడటంతో తినే ఫుడ్ విషయంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సంప్రదాయంగా లభించే ఆహార పదార్థాలను డైట్ తినేందుకు ఇప్పటి జనరేషన్ వాళ్లు మొగ్గు చూపుడం లేదు. తక్కువ టైంలో తయారుచేసే, రెడీమెడ్ ఫుడ్ కు ఆకర్షితులవుతున్నారు. ఈ ఫాస్టు ఫుడ్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇలాంటి వారిపై ఓ పరిశోధన సంస్థ రీసెర్చ్ చేసి తాజాగా వెల్లడించిన విషయాలు ప్రతీ ఒక్కరిలో ఆందోళన ను రేపుతున్నాయి.
ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ ఫాస్టుఫుడ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫాస్టు ఫుడ్ కు అలవాటు పడిన వారిలో సెర్మ్(వీర్యం) కౌంట్ చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుందని పరిశోధనలో వెల్లడైంది. 19ఏళ్ల సగటు వయస్సున్న 2,900మందిపై పరిశోధన చేపట్టి తాజాగా వివరాలను వెల్లడించారు. పిజ్జా, ప్రెంచ్ ప్రైస్, బీఫ్స్, స్నాక్, షుగరీ బేవరీ ఐటమ్స్, పాలిష్ చేసిన బియ్యం, స్వీట్స్ తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ గా ఉన్నట్లు తేలింది. అదేవిధంగా చేపలు, చికెన్, కూరగాయలు, పండ్లు, నీళ్లు వంటివి ఆహారంగా తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువు గా ఉన్నట్లు వెల్లడైంది.
డానిష్ డైట్ తీసుకునే వారిలో అందరి కంటే తక్కువగా 146మిలియన్లు, వెజిటేరియన్ డైట్ తీసుకునే వారిలో 151మిలియన్లు, హెల్తీ డైట్ తీసుకునే వారిలో 167మిలియన్లు అత్యధికంగా స్పెర్మ్ కౌంట్ ఉత్పత్తి అయినట్లు పరిశోధనలో వెల్లడయింది. ఫాస్టుపుడ్ తీసుకునే ఆడవాళల్లోనూ అండోత్పత్తి(ఫెర్టిలిటీ) సమస్య ఏర్పడుతుందని తెలిపింది. డైట్ తోపాటు స్మోకింగ్, రేడియేషన్, ఫెస్టిసైడ్, బంగారం, స్టీల్ చైన్లు, వెండి వస్తువులు భారీగా ధరించడం కూడా స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు.
ఫాస్టుఫుడ్ ప్రియులు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కొంచెం వీలుచేసుకొని హెల్త్ డైట్ ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యం గా ఉండటంతో పాటు మగతనాన్ని కాపాడుకున్నవాళ్లు అవుతున్నారు. సంతానం కోసం పరితపించే వాళ్లు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ఫాస్టు ఫుడ్ మత్తు వదిలి సంప్రదాయక ఆహార పదార్థాలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేనట్లయితే అసలుకే ఎసరు రావడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.
* అసలుకే ఎసరుపెడుతున్న వైనం..