Begin typing your search above and press return to search.

సూసైడ్ నోట్‌.. ఇది నేను కోరుకున్న జీవితం కాదు!

By:  Tupaki Desk   |   12 Jun 2022 4:35 AM GMT
సూసైడ్ నోట్‌.. ఇది నేను కోరుకున్న జీవితం కాదు!
X
పాపుల‌ర్ టాలీవుడ్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌త్యూష గ‌రిమెళ్ల అనుమానాస్ప‌ద మృతి క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లోని త‌న గృహంలో ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ప్రాథ‌మికంగా క‌థ‌నాలు వ‌చ్చినా దీనిని పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా న‌మోదు చేసి ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు.

అయితే ప్ర‌త్యూష రాసిన సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నార‌ని తెలిసింది. ఇందులో ఇది తాను కోరుకున్న జీవితం కాద‌ని.. నేను నా త‌ల్లిదండ్రుల‌కు భారంగా మార‌లేను! అంటూ ప్ర‌త్యూష ఆవేద‌న వెలిబుచ్చిన‌ట్టు చెబుతున్నారు.

రిటైర్డ్ ఐఆర్ ఎస్ కృష్ణారావు కుమార్తె ప్ర‌త్యూష‌. ఇండియాలో టాప్ 30 డిజైన‌ర్ల‌లో ఒక‌రిగా ఓ వెలుగు వెలిగిన ప్ర‌త్యూష‌కు ఆర్థిక‌ప‌ర‌మైన క‌ష్టాలేవీ లేవు. కానీ ఇంత‌లోనే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిన అవ‌స‌ర‌మేమిటీ? అన్న కోణంలో ద‌ర్యాప్తు సాగుతోందని తెలుస్తోంది. ప్ర‌త్యూష డిప్రెష‌న్ లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? అన్న‌ది కూడా పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంటుంది.

పోస్టుమార్టం పూర్తి:

ఉస్మానియా ఆస్ప‌త్రిలో ప్ర‌త్యూష గ‌రిమెళ్ల పోస్టుమార్టం పూర్త‌యింది. ఆమె కార్బ‌న్ మోనాక్సైడ్ వాయువును పీల్చి మ‌ర‌ణించింద‌ని వైద్యుల రిపోర్ట్ అందింది. నేడు ప్ర‌త్యూష అంత్య‌క్రియ‌లు హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్నాయి. కాగా త‌న స్నేహితురాలి ఆక‌స్మిక మ‌ర‌ణంపై ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ తీవ్ర ఆవేద‌న వెలిబుచ్చారు. ఈ మ‌ర‌ణం త‌న‌ను షాక్ కి గురి చేసింద‌ని మంచి స్నేహితురాలిని కోల్పోయాన‌ని దిగ్భాంతిని వ్య‌క్తం చేసారు.