Begin typing your search above and press return to search.

రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యల్ని సమర్థించిన కశ్మీర్ పెద్దాయన

By:  Tupaki Desk   |   14 Dec 2021 4:33 AM GMT
రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యల్ని సమర్థించిన కశ్మీర్ పెద్దాయన
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనటానికి రాజకీయాలకు మించింది మరొకటి ఉండదు. ఎవరెలా అనుకున్నా.. కశ్మీర్ పెద్దాయనగా.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జాతీయ అధ్యక్షుడు..మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఫరూఖ్ అబ్దుల్లా నోటి నుంచి ఊహించని రీతిలో ఒక వ్యాఖ్య తాజాగా వచ్చింది.

వాస్తవానికి ఆయన చేసే వ్యాఖ్యల్ని విన్న ప్రతిసారీ.. దేశంలోని మెజార్టీ భారతీయుల ఒంటికి కారం రాసుకున్నట్లుగాఉంటుంది. అందుకు భిన్నంగా చాలా ఏళ్ల తర్వాత.. తొలిసారి దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యను సమర్థించటం ఆసక్తికర పరిణామంగా చెప్పక తప్పదు.

ఇంతకూ రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్య ఏమిటన్న విషయంలోకి వెళితే.. మతం ప్రాతిపదికన దేశ విభజన జరగటం కచ్ఛితంగా చారిత్రక తప్పిదమే’ అని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ పర్వ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. స్వాతంత్య్రానికి ముందు మత ప్రాతిపదికన భారత్ ను విభజించటం చారిత్రక తప్పిదమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందుకు ఫలితంగా 1971లోయుద్ధం వచ్చిందని.. దేశాన్ని ముక్కలు చేయాలన్న దుష్ట తలంపుతో ఉగ్రవాదాన్ని.. భారత వ్యతిరే శక్తుల్ని పాక్ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యకు సానుకూలంగా స్పందించారు ఫరూక్ అబ్దుల్లా. తాజాగా స్పందించిన ఆయన.. దేశ విభజనను వ్యతిరేకిస్తూ రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యాల్ని సమర్థించిన వైనం ఆసక్తికకరంగా మారింది. ఫరూక్ అబ్దుల్లా లాంటి కశ్మీరీ పెద్దాయన ఇప్పటివరకు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మాత్రమే నిలిచేవారు. అందుకు భిన్నంగా ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు అందరిని ఆకర్షిస్తున్నాయి.

‘‘పాక్ కావాలనటం మహమ్మద్ అలీ జిన్నా చేసిన అనుచితమైన డిమాండ్. అప్పుడు మస్లింలకు 26 శాతం ఉన్న రిజర్వేషన్ ను 39 శాతంఇవ్వాలని జిన్నా పట్టుబట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో.. ఆయన దేశ విభజనకు మొగ్గు చూపారు.

ఈ విభజన వల్ల కేవలం కశ్మీరీలే కాదు.. భారత్ లోని ముస్లింలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశం ఒక్కటిగా ఉండి ఉంటే.. ఈ కష్టాలు ఉండేవి కావు. మనమంతా ఐక్యంగా.. సోదరభావంతో ఉండేవాళ్లం. కానీ.. భారత్.. పాక్ విబేధాల కారణంగా మతపరమైన సమస్యలు పెరుగుతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.