Begin typing your search above and press return to search.

ఆయన నోటికి అర్జెంట్ గా తాళం వేసేయాల్సిందే

By:  Tupaki Desk   |   6 Dec 2015 6:47 AM GMT
ఆయన నోటికి అర్జెంట్ గా తాళం వేసేయాల్సిందే
X
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం రాజకీయ నాయకులకు అలవాటే. అయితే.. హద్దులు మీరేలా.. దేశ సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగే అంశాల మీద వ్యాఖ్యలు చేయకుండా ఉండటం మంచిది. అయితే... దేశంలో నేతలు చేసే వ్యాఖ్యలకు చెక్ పాయింట్ లేకపోవటం.. ప్రజాస్వామ్య పేరుతో ఎవరికి వారు తమకు తోచినట్లుగా వ్యాఖ్యలు చేయటం.. అది కూడా దేశ సరిహద్దులకు సంబంధించినవి చేయటం స్వాగతించే పరిణామం ఎంతమాత్రం కాదు.

ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. దేశంలోని కొంత భాగాన్ని పాకిస్థాన్ కు.. మరికొంత చైనాకు ఇచ్చేయాల్సి ఉంటుందేమో. ఈ మధ్య కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తాజాగా మరింత వివాదాన్ని రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే పాక్ అక్రమిత కశ్మీర్ ను పాక్ కు అప్పజెప్పాలంటూ ఉచిత సలహాను అడగకుండానే ఇచ్చేసిన ఆయన.. తాజాగా సరిహద్దుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్.. భారత్ దేశాల మధ్య శాంతి కోసం వాస్తవాధీన రేఖనే సరిహద్దులుగా మార్చుకుంటే సమస్య పరిష్కారం అవతుందని వ్యాఖ్యానించారు. పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతాన్ని తిరిగి వెనక్కు తెచ్చుకునే అవకాశం లేదంటూ తేల్చేసిన ఆయన.. వాస్తవాధీన రేఖనే సరిహద్దుగా మార్చుకుంటే పాక్ తో శాంతి వచ్చేస్తుందని చెప్పుకొచ్చని వ్యాఖ్యలు చేశారు.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి చిత్రమైన ఐడియాలు పాక్ కు చెందిన నేతలు ఎవరూ చేయకపోవటం. ఫరూక్ మాదిరి.. పాక్ కు చెందిన ఒక్కరేంట ఒక్క నేత అయినా.. పాక్ అక్రమించిన కశ్మీర్ ను భారత్ కు ఇచ్చేసి ఆ దేశంతో స్నేహం పెంచుకొని అభివృద్ది దిశగా అడుగులు వేద్దామని ఎందుకు కోరుకోరు? మరి.. అందుకు భిన్నంగా మాట్లాడుతున్న ఫరూక్ లాంటి నేతల నోటికి అర్జెంట్ గా తాళాలు వేయాల్సిన అవసరం లేదంటారా?