Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ పై వెనక్కి తగ్గని రైతులు

By:  Tupaki Desk   |   29 Nov 2020 5:00 PM IST
మోడీ సర్కార్ పై వెనక్కి తగ్గని రైతులు
X
తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ ఎలాగైతే రోడ్డెక్కి నిరసనలు తెలిపారో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సైతం అదే పునరావృతమైంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీకి భారీఎత్తున వచ్చిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మద్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఢిల్లీ శివారు బురారి ప్రాంతంలోని నిరంకార్ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారానే కాకుండా కాలినడకన నిరసన స్థలికి చేరుకున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పటి వరకు కదిలేదని జాతీయ రహదారిపై బైటాయిస్తున్నారు. రైతులకు మేధావులు, సామాజికవేత్తలు మద్దతు తెలిపారు.

రైతులతో వెంటనే చర్చలు జరపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాజకీయ పోాలు, విద్యార్థి సంఘాలు సైతం రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రైతుల అణిచివేతలు ఆపాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. దేశంలో ప్రముఖ పార్టీల నేతలు కూడా ఈ మేరకు సంయుక్త ప్రకటన జారీ చేశాయి.

దేశ ఆహార భద్రతకు, కనీస మద్దతు ధరలకు ముప్పు తెచ్చేలా ఉన్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తెలిపారు. రైతుల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

కాగా ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని రైతులు భీష్మించారు. ట్రక్కులు, ట్రాక్టర్లలో కాలినడకన వచ్చారు. 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలు వెంట తీసుకొచ్చుకున్నామని రైతులు చెప్పారు. ట్రక్కుల్లో గోధుమ పిండి, బియ్యం, కట్టెలు, ఉల్లిగడ్డలు తీసుకొచ్చి మైదానంలోనే వంట చేసుకొని తింటూ నిరసన తెలుపుతున్నారు.