Begin typing your search above and press return to search.

రైతుల ఉద్యమంతో ఆ రాష్ట్రాలకు రోజుకు కలిగే నష్టమెంతో తెలిస్తే.. నోట మాట రాదు

By:  Tupaki Desk   |   16 Dec 2020 9:12 AM IST
రైతుల ఉద్యమంతో ఆ రాష్ట్రాలకు రోజుకు కలిగే నష్టమెంతో తెలిస్తే.. నోట మాట రాదు
X
కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలపై తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేస్తూ పంజాబ్.. హర్యానా.. హిమాచల్ ప్రదేశ్ తో పాటు.. ఇతర రాష్ట్రాల రైతులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు గడిచిన తర్వాత కూడా ఆందోళన అంతకంతకూ పెరుగుతుందే తప్పించి తగ్గని పరిస్థితి. ఇలాంటివేళ.. ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది అసోచామ్. రైతులు చేస్తున్న నిరసన కారణంగా కేంద్రానికి జరుగుతున్న నష్టంతోపాటు.. ఆయా రైతుల కారణంగా రాష్ట్రాలు నష్టపోయేది ఎంతన్న విషయాన్ని గణాంకాలతో చెబుతూ అవాక్కుఅయ్యేలా చేస్తోంది.

రైతు ఉద్యమం కారణంగా పంజాబ్.. హిమాచల్ ప్రదేశ్.. హర్యానా రాష్ట్రాలకు ప్రతి రోజు రూ.3వేలునుంచి రూ.3500 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అసోచామ్ పేర్కొంది. అంతేకాదు.. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ.. తాజాగా చేపట్టిన ఆందోళన కారణంగా సరఫరా.. ఉత్పత్తి ఛైన్ దెబ్బ తింటుందని హెచ్చరించింది. అంతేకాదు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ఆర్తిక వ్యవస్థ మీద పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని లెక్క కట్టింది.

ఇప్పటికైనా కేంద్రం స్పందించి.. ఈ ఇష్యూకు సరైన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొంది. లేని పక్షంలో భారీ మూల్యాన్నిచెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అసోచామ్ చెప్పిన తర్వాత కూడా కేంద్రం ఈ ఇష్యూ మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.