Begin typing your search above and press return to search.

సుప్రింకోర్టు పరిధిలోకి రైతు ఉద్యమం

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:00 PM IST
సుప్రింకోర్టు పరిధిలోకి రైతు ఉద్యమం
X
రైతుల ఉద్యమం విషయంలో సుప్రింకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గడచిన 22 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమాన్ని విరమింపచేయటంలో కేంద్రప్రభుత్వం ఫెయిలైందని సుప్రింకోర్టు అభిప్రాయపడింది. అందుకనే తనంతట తానుగా ఓ కమిటి వేయబోతున్నట్లు సుప్రిం ధర్మాసనం ప్రకటించటం కలకలం రేపుతోంది. రైతుల నుండి ప్రభుత్వం నుండి చెరికొంతమంది పేర్లను తనకు సూచించాలని సుప్రింకోర్టు కోరింది.

ఉద్యమం చేస్తున్న రైతులతో చర్చలపేరుతో నాలుగుసార్లు భేటీ అయినా కేంద్రప్రభుత్వం ఎటువంటి పురోగతి సాధించలేదని సుప్రింకోర్టు కామెంట్ చేసింది. అంటే ఇపుడు సుప్రింకోర్టు వేయబోతున్న కమిటి కేంద్రప్రభుత్వం ఆలోచనలతో ఎటువంటి సంబంధం లేకుండానే జరిగిపోతుండటం గమనార్హం.రైతుల ఉద్యమాన్ని పరిష్కరించటంలో కేంద్రప్రభుత్వం విఫలమైందంటూ సుప్రింకోర్టు ఘాటుగా కామెట్ చేసింది.

రైతులతో కేంద్రం జరుపుతున్న సంప్రదింపులు ఎన్నిరోజులైనా సక్సెస్ అయ్యేట్లు కనబడటం లేదని సుప్రింకోర్టు అభిప్రాయపడింది. చూస్తుంటే రైతల ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందే ప్రమాదం కనబడుతోందని సుప్రిం ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే రైతుల ఉద్యమానికి అనుకూలంగాను, ప్రతికూలంగాను కోర్టులో చాలా పిటీషన్లు దాఖలైన కారణంగా తాము చొరవ తీసుకోవాల్సొస్తోందని ధర్మాసనం స్పష్టం చేసింది.

రైతుల ఉద్యమం చూస్తుంటే ఇప్పట్లో చల్లారేలాగ కనబడటం లేదు. పైగా రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇప్పటివరకు రైతులు మాత్రమే ఉద్యమంలో పాల్గొంటుండగా ఇప్పటినుండి వాళ్ళ కుటుంబసభ్యులు కూడా రావటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఆడవాళ్ళు కూడా భాగస్వాములవుతున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక డిమాండ్ తో రైతు సంఘాలు ఒకవైపు, రద్దు సాధ్యంకాదన్న సమాధానంతో కేంద్రం మరోవైపు భీష్మించుకుని కుర్చోవటంతోనే ప్రతిష్టంభన వచ్చేసింది. మరి తాజాగా సుప్రింకోర్టు చొరవ తీసుకున్న కారణంగా అయినా సమస్య వెంటనే పరిష్కారమవుతుందేమో చూడాలి.