Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ నిర్ణయం పై ఉత్కంఠం గా ఎదురు చూస్తున్న రైతులు ..ఎందుకంటే !

By:  Tupaki Desk   |   28 Dec 2019 6:49 AM GMT
సీఎం కేసీఆర్ నిర్ణయం పై ఉత్కంఠం గా ఎదురు చూస్తున్న రైతులు ..ఎందుకంటే !
X
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండోసారి తెలంగాణ రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్దే ద్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకి ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నిరవేర్చుతూ పోతున్నాడు. ఇప్పటికే కొన్ని పథకాలని అమల్లోకి తీసుకురాగా ..మరి కొన్నింటి పై సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో సీఎం కేసీఆర్ వైపు తెలంగాణ రైతులు ఆశగా చూడటం మొదలు పెట్టారు. దేనికోసం అంటే పంటరుణాలు మాఫీ అంటూ ఎన్నికల లో సీఎం కేసీఆర్ రైతుల పై వరాల జల్లు కురిపించారు. ముందస్తు ఎన్నికల కు ముందు రైతుల కు ఇచ్చిన హామీ మేరకు రూ.1లక్ష వరకు రుణమాఫీ చేయాల్సిఉంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గ దర్శకాలు విడుదల చేయకుండా... కేవలం అర్హుల జాబితా తయారుచేయాలని ఆదేశాలు ఇవ్వటంతో బ్యాంకర్లు ఆలోచనల్లో పడ్డారు. ఎందుకు అంటే ముఖ్యంగా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తారా? చేయరా? ప్రతి రైతుకు లక్ష రూపాయల చొప్పున మాఫీ చేస్తారా? కుటుంబం మొత్తానికి కలిపి లక్ష వరకు చెల్లిస్తారా? వంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత... పంట రుణాల మాఫీ పథకం ఫైల్ తెరుచుకుంది. దీనితో రైతులు బంగారం పెట్టి తెచ్చుకున్న రుణాలని మాఫీ చేస్తారా లేదా అని ఉత్కంఠత తో ఎదురుచూస్తున్నారు.

అయితే , బ్యాంకు వర్గాలు కానీ ,రాష్ట్ర ప్రభుత్వం గానీ అధికారిక లెక్కలు ప్రకటించక పోయినప్పటికీ... రూ. 31,824 కోట్ల వరకు బకాయిలు ఉంటాయని ఆరు నెలల క్రితం ఎస్‌ ఎల్‌ బీసీ ఓ అంచనాకు వచ్చింది. 48.14 లక్షల మంది రైతులు రుణమాఫీ పథకానికి అర్హులు ఉన్నారు. 2018 డిసెంబర్‌ 11 తేదీని కటాఫ్‌ తేదీ గా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇంతకుమించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకర్లు అర్హుల జాబితాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందు లో ప్రధానం గా బంగారు రుణాల అంశం చర్చకు వస్తోంది. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను క్రాప్‌ లోన్ల కింద పరిగణించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటన చేసింది. 5.56 లక్షల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు రూ. 5,253 కోట్ల వరకు ఉన్నాయి. ఈ బకాయిలు మాఫీ చేస్తారా? లేదా? అనే స్పష్టతను ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే సీఎం కేసీఆర్‌ ఈ విషయం లో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ... కుటుంబానికా? లేక ఒక్కో రైతుకా? అనే సందేహం వ్యక్తమవుతోంది. 2014 లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... రుణమాఫీ చేసినపుడు కుటుంబాన్ని యూనిట్‌ గా తీసుకొని రుణమాఫీ చేశారు. కానీ , ఇప్పుడు ఎలా చేస్తారో ఎవరికీ తెలియడం లేదు. దీనిపై ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వస్తే కానీ , స్పష్టంగా తెలియదు. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యం నేపథ్యం లో... రూ. 31,824 కోట్ల ను ఒకేసారి ప్రభుత్వం మాఫీచేసే అవకాశం లేదు. సీఎం కేసీఆర్‌ కూడా విడతల వారిగా పంపిణీ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. దీనికి తగ్గట్టే రుణాల మొత్తాన్ని పరిగణలోకి తీసుకోని నాలుగు స్లాబులు గా రైతుల లెక్కలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలో నే ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది.