Begin typing your search above and press return to search.
ఇంట్లో నుంచి బయటకొస్తున్న జగన్ ఎంపీపై రాడ్ తో దాడికి యత్నం
By: Tupaki Desk | 16 Oct 2020 10:00 AM ISTపెద్ద ప్రమాదాన్నితృటిలో తప్పించుకున్నారు ఏపీ అధికారపక్షానికి చెందిన ఎంపీ నందిగం సురేశ్. బాపట్ల లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనపై జరిగిన దాడి యత్నం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడిగా.. విశ్వసనీయ వ్యక్తిగా అభివర్ణించే నందిగంకు ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది. యువకుడైన ఎంపీపై దాడికి ప్లాన్ చేసిన వైనం షాకింగ్ గా మారింది.
గురువారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఆయన ఇంటి వద్ద మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న క్రమంలో నిందితుడు.. బైక్ ను అడ్డుగా పెట్టాడు. అనంతరం రాడ్ తో దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు.
దీంతో స్పందించిన గన్ మెన్లు వెంటనే స్పందించటం.. నిందితుడ్ని అడ్డుకోవటంతో పెనుప్రమాదం తృటిలో తప్పింది. దాడికి కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. ఎంపీకి భద్రతను అందిస్తున్న గన్ మెన్లు సకాలంలో స్పందించటంతో పాటు.. ఎంపీపై ఎలాంటి దాడి జరగకుండా అడ్డుకున్నారు.
అదే సమయంలో.. దాడికి ప్రయత్నించి ఫెయిల్ కావటంతో పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పజెప్పారు. దాడికి అసలు కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఉదంతం అధికారపార్టీలో హాట్ టాపిక్ గా మారింది.