Begin typing your search above and press return to search.

సొంత ఇలాకాలో చంద్రబాబుకు షాకిచ్చిన రైతు

By:  Tupaki Desk   |   26 Feb 2020 11:49 AM GMT
సొంత ఇలాకాలో చంద్రబాబుకు షాకిచ్చిన రైతు
X
కుప్పం.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇలాకా.. అక్కడ ప్రస్తుతం చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రలో భాగంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల పాటు సొంత నియోజకవర్గంలోనే బస్సు యాత్రలో పాల్గొంటున్నారు.

ఈ యాత్రలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే బాబు పర్యటనలో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

కుప్పంలోని ఓ గ్రామంలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా వెంకటేశ్వర్లు అనే రైతు తన సమస్యను చెబుతూ చంద్రబాబుకు దిమ్మదిరిగే షాకిచ్చాడు. టీడీపీ హయాంలో తన భూమిని ఆన్ లైన్ చేసేందుకు రూ.లక్ష లంచంగా ఇచ్చానని చంద్రబాబు ముందే ఆడిపోసుకున్నాడు. ఇది అన్యాయం సార్ అంటూ ప్రశ్నించాడు. రైతు ప్రశ్నతో తెలుగు తమ్ముళ్లతోపాటు చంద్రబాబు ఖంగుతిన్నాడు.

తేరుకున్న బాబు ఇది జరిగింది వైసీపీ ప్రభుత్వంలోనా అని రైతును ప్రశ్నించాడు. కాదు మీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనేని మరోసారి చెప్పుకొచ్చాడు. దీనికి హతాషుడైన చంద్రబాబు టాపిక్ ను మెల్లిగా డైవర్ట్ చేశాడు. కొంత మంది అధికారులు దొంగలుగా ఉంటారని..వారి వల్ల తనకు చెడ్డ పేరు వస్తుందని రైతుతో సర్ధి చెప్పారు.

లైవ్ లో జరిగిన ఈ వీడియో ఇప్పుడు చంద్రబాబును బుక్ చేసింది. బాబు హయాంలోనే లంచం ఇచ్చానని చెప్పిన రైతు వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో దెబ్బకు బాబుకు, టీడీపీకి నోట మాట రాకుండా అయ్యింది.

వీడియో కోసం క్లిక్ చేయండి