Begin typing your search above and press return to search.

67 కోట్లకు తన విలువైన ఇంటిని అమ్మేసిన ప్రముఖ క్రికెటర్

By:  Tupaki Desk   |   8 July 2022 10:00 PM IST
67 కోట్లకు తన విలువైన ఇంటిని అమ్మేసిన ప్రముఖ క్రికెటర్
X
క్రికెటర్లు సహా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలందరూ ఇప్పుడు తమ పెట్టుబడులను ఆస్తులపైనే పెడుతున్నారు. ఇళ్లు, స్థలాలు కొని పెట్టుకుంటున్నారు. ఇక మంచి రేటు వస్తే.. అవసరాలకు తగినట్లుగా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ప్రముఖ క్రికెటర్ స్వీవ్ స్మిత్ కూడా అదే పనిచేశాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ సిడ్నీలోని తన విలాసవంతమైన భవనాన్ని $12.38 మిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 67 కోట్లకు ) విక్రయించాడు.

రెండేళ్ల క్రితం ఈ ఆస్తిని స్వీవ్ స్మిత్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు చెల్లించిన దానికంటే దాదాపు రెట్టింపుకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు..

నాలుగు పడక గదులు, మూడు బాత్‌రూమ్‌ల ఇంటిని వేలం వేయడానికి నాలుగు పార్టీలు నమోదు చేసుకున్నాయి, $11.5 మిలియన్ల ఆఫర్‌తో బిడ్డింగ్ ప్రారంభించబడింది.

766 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో హార్బర్ వీక్షణలతో పాటు సినిమా, స్విమ్మింగ్ ఫూల్ అత్యాధునిక వసతులు కలిగిన కిచెన్ సహా అనేక ఉత్కంఠభరితమైన ఫీచర్లు ఉన్నాయి.

స్టీవ్ స్మిత్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడు. అక్కడ ఆస్ట్రేలియాటీం శ్రీలంకతో క్రికెట్ ఆల్-ఫార్మాట్ సిరీస్ ఆడుతోంది. మొదటి టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం గాలెలో ఆడుతున్న రెండవ టెస్టులో ఆధిపత్యంలో ఉంది. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆశిస్తున్నారు.