Begin typing your search above and press return to search.

క్వారంటైన్ లో ఫ్యామిలీ.. ఇల్లు దోచేసిన దొంగలు

By:  Tupaki Desk   |   16 May 2020 12:30 AM GMT
క్వారంటైన్ లో ఫ్యామిలీ.. ఇల్లు దోచేసిన దొంగలు
X
రోగమొచ్చి వారంతా క్వారంటైన్ లో ఏడుస్తుంటే.. దొంగలు మాత్రం తమ చేతివాటం ప్రదర్శించిన ఘటన అందరినీ షాక్ కు చేసింది. కరోనా వైరస్ తో ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వేళ తాళం వేసిన ఉన్న ఇంటిలోకి చొరబడి దొంగలు మొత్తం దోచుకుపోయిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. క్వారంటైన్ పూర్తయ్యాక వచ్చి చూసిన ఆ కుటుంబం షాక్ అయ్యింది. ఇల్లు మొత్తం దొంగలు ఊడ్చేశారని తెలుసుకొని కుటుంబం బోరుమంది..

ఇండోర్ లోని ఇమ్లీబజార్ లో ఓ షాపు నడుపుతున్న వ్యక్తి కుటుంబంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు ఆ కుటుంబాన్ని మొత్తం ఏప్రిల్ 6న క్వారంటైన్ కు తరలించారు. ఏప్రిల్ 22న క్వారంటైన్ పూర్తయ్యాక ఇంటికి వచ్చి చూసుకుంటే సర్వం గుల్ల అయిపోయింది. మొత్తం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంట్లోని విలువైన వస్తువులు.. బంగారం.. మొత్తం 12 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే కరోనా క్వారంటైన్ కు వెళ్లొచ్చిన వీరి ఇంటికి రావడానికి పోలీసులు భయపడి తూతూ మంత్రంగా విచారణ జరిపారు. దొంగల ఆచూకీపై శ్రద్ధ తీసుకోలేదు. దీంతో ఆ కుటుంబం ఏకంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ట్వీట్ చేసి వేడుకుంది. సీఎం ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

కాగా ఏప్రిల్ 26న ఆ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ మళ్లీ రావడంతో వారంతా ఆస్పత్రికి వెళ్లారు. దీంతో కేసు అతీగతీలేకుండా పోయింది.