Begin typing your search above and press return to search.

25ఏళ్లకు అమెరికన్ దంపతులకు నిజం తెలిసింది

By:  Tupaki Desk   |   12 Aug 2019 12:20 AM IST
25ఏళ్లకు అమెరికన్ దంపతులకు నిజం తెలిసింది
X
25 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచారు.. పెద్దచేశారు. గారాబంగా చూసుకున్నారు. కూతురుకు గొప్ప జీవితం ఇవ్వాలంటూ తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ ఒక్క డీఎన్ ఏ టెస్ట్ అంతా తలకిందులు చేసింది. ఆ బిడ్డ తమది కాదని తెలిసి భోరుమన్నారు. సంతానోత్పత్తి కేంద్రంపై కోర్టుకెక్కారు. అమెరికాలో జరిగిన ఈ రియల్ స్టోరీ ఆసక్తి రేపుతోంది.

అమెరికాలోకి ఒహియోకు చెందిన ఇద్దరు భార్యభర్తలు జోసెఫ్ కార్టెలోన్ దంపతులు 25 ఏళ్ల కింద పిల్లలు కాకపోవడంతో 1994లో సిన్సినాటిలోని మూడు ఆరోగ్య సంస్థలను సంప్రదించారు. సంతానోత్పత్తి చికిత్స తీసుకున్నారు. జోసెఫ్ వీర్యాన్ని తీసి అండంతో ఫలదీకరణం చెందిన సరోగసి (అద్దెగర్భం)తో ఓ బిడ్డను కన్నారు. ఆ ఆడశిశువు తమ రక్తమేనని ఇన్నాళ్లు పెంచారు.

అయితే ఇటీవల జోసెఫ్ ఆయన భార్య - పెంచుకున్న కూతురుకు డీఎన్ ఏ పరీక్షలు జరపగా ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది. 25 ఏళ్లుగా పెంచుకుంటున్న కూతురు డీఎన్ ఏ తండ్రితో కలవలేదు. దీంతో తమ కూతురు కాదని తెలిసి ఆ దంపతులు షాక్ అయ్యాయి. అమ్మాయి డీఎన్ ఏలో ఐదుగురు తండ్రుల డీఎన్ఏ ఉండడంతో షాక్ అవ్వడం వారివంతైంది. కూతురు అసలైన తండ్రి తాను కాదని తెలిసి జోసఫ్ ఖిన్నుడయ్యాడు. ఆమె ఐదుగురు తండ్రుల్లో ఓ వ్యక్తి క్రిస్ట్ ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తి అని తేలింది.

తన వీర్యంతో పురుడుపోసుకున్న బిడ్డ కాదని తెలిసి దంపతులిద్దరూ షాక్ అయ్యారు. 25 ఏళ్లుగా పెంచుకుంటున్న కూతురు తండ్రులు కూడా ఎవరో తెలియకపోవడం.. తన కూతురు కాకపోవడంతో జోసెఫ్ తాజాగా కోర్టుకెక్కాడు. తమను మోసం చేసి వేరొకరి బిడ్డను అంటగట్టిన సంతానోత్పత్తి కేంద్రాలపై చర్య తీసుకోవాలని కోర్టులో పిటీషన్ వేశారు. తమకు జరిగిన అన్యాయంపై స్పందించాలని డిమాండ్ చేశాడు.