Begin typing your search above and press return to search.

ప్రవాసులకు షాకిచ్చిన గల్ఫ్ దేశం

By:  Tupaki Desk   |   1 Sept 2019 2:47 PM IST
ప్రవాసులకు షాకిచ్చిన గల్ఫ్ దేశం
X
అమెరికానే కాదు గల్ఫ్ దేశం కువైట్ కూడా తన వలస విధానంలో భారీ మార్పులు చేసింది.ముఖ్యంగా కువైట్ లో ఉంటున్న భారతీయులకు భారీ షాక్ ను ఇచ్చింది. ఇప్పుడీ పరిణామం కువైట్ లో ఉంటున్న భారతీయులే కాదు.. విదేశీయులైన వారి కుటుంబాలపై భారీగా పడుతోంది.

తాజాగా కువైట్ ప్రభుత్వం కొత్తగా పెట్టిన వీసా నిబంధనలు అక్కడ నివసించే వలసదారుల పాలిట శాపంగా మారాయి. కువైట్ లో నివసించే వలసదారుల పిల్లలు 12 ఏళ్లు దాటితే అక్కడ డిపెండెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతారు. ఇక 18 ఏళ్లు దాటిన వారు పిల్లలు కూడా అక్కడ యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తూనే వీసా ఇస్తారు. లేదంటే దేశం నుంచి వెళ్లగొడుతారు.

బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన వారిలో భారతీయులే ఎక్కువ. వీరు కుటుంబాన్ని కువైట్ తీసుకెళ్లాంటే అతడికి 12 ఏళ్లు దాటిన కుమారుడు ఉంటే ప్రస్తుత కువైట్ వీసా నిబంధనల ప్రకారం అతడు తల్లిదండ్రులతో ఉండడానికి వీలు పడదు. 12 ఏళ్లు దాటిన విదేశీ పిల్లలకు డిపెండెంట్ వీసా రాదు. ఇక 18 ఏళ్లు దాటిన విదేశీయుల పిల్లలు అక్కడి చదివితేనే డిపెండెంట్ వీసా ఇస్తారు. చదవకపోతే తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి వీల్లేదన్నమాట..

ఇప్పటికే కువైట్ ఉద్యోగాల కోత - వలస వీసా నిబంధనలు కఠినం చేయడంతో చాలా మంది భారతీయులు కువైట్ వదిలి తిరిగివచ్చేస్తున్నారు. ఇప్పుడు వలసవాదుల పిల్లలు ఉండడానికి వీల్లేకుండా నిబంధనలు పెట్టడంతో అక్కడ పనిచేసేవ వారు వారు కుటుంబాలతో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది.